Job Mela: నేడు కర్నూలు జిల్లాలో మెగా జాబ్ మేళా నిర్వహణ.. పలు కంపెనీల్లో 1350 ఉద్యోగాలు భర్తీ
Job Mela: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, కర్నూలు జిల్లాలో 2025 డిసెంబర్ 8వ తారీఖున మెగా జాబ్ మేళా నిర్వహించనున్నారు. పలు కంపెనీల్లో 1350 ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో జాబ్ మేళా జరుగుతుంది. 10వ తరగతి, ఇంటర్మీడియట్, ఏదైనా డిగ్రీ, ఐటిఐ, డిప్లొమా, బిటెక్, పీజీ, ఫార్మసీ అర్హతలు కలిగిన అభ్యర్థులు జాబ్ మేళాలో పాల్గొనవచ్చు. ఎటువంటి రాత పరీక్ష ఉండదు, ఫీజు ఉండదు.. డైరెక్ట్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. కర్నూలు కె.వి.ఆర్ కాలేజ్ నందు జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుంది.
Job Mela నిర్వహిస్తున్న సంస్థ
ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థ (APSSDC) ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నారు.
Job Mela లో పాల్గొంటున్న కంపెనీలు
జాబ్ మేళాలో మొత్తం 19 కంపెనీలు పాల్గొంటున్నాయి. కీర్తి మెడికల్ స్టోర్స్ ప్రైవేట్ లిమిటెడ్, టీవీఎస్ లుకాస్, టాటా ఎలక్ట్రానిక్స్, గ్రీన్ టెక్ ఇండస్ట్రీస్, అపోలో ఫార్మసీ, జస్ట్ డయల్, పేటీఎం, zepto, blinkit, టాటా క్యాపిటల్, ప్రీమియర్ హెల్త్ కేర్ సర్వీసెస్.. తదితర ప్రముఖ కంపెనీలు జాబ్ మేళాలో పాల్గొంటున్నాయి.
ఖాళీల వివరాలు
ఈ జాబ్ మేళా ద్వారా 19 కంపెనీల్లో మొత్తం 1350 ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు.
విద్యార్హతలు
10వ తరగతి, ఇంటర్మీడియట్, ఏదైనా డిగ్రీ, ఐటిఐ, డిప్లొమా, బిటెక్, పీజీ, ఫార్మసీ అర్హతలు కలిగిన అభ్యర్థులు జాబ్ మేళాలో పాల్గొనవచ్చు.
వయో పరిమితి
18 నుంచి 35 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు జాబ్ మేళాలో పాల్గొనవచ్చు.
Job Mela నిర్వహణ తేదీ
- 08-12-2025 తేదీన ఇంటర్వ్యూ నిర్వహించనున్నారు
- ఇంటర్వ్యూ కు హాజరయ్యే అభ్యర్థులు ముందుగా naipunyam.ap.gov.in వెబ్సైట్లో తమ వివరాలు నమోదు చేసుకోవాలి
- ఇంటర్వ్యూకు హాజరయ్య అభ్యర్థులు తమ బయోడేటా, ఆధార్ కార్డు, పాన్ కార్డు, విద్యార్హత పత్రాల జిరాక్స్ కాపీలు వెంట తీసుకుని వెళ్లాలి
Job Mela నిర్వహణ ప్రదేశము
కర్నూలు జిల్లా: KVR Govt. College for Women (A), Narasimha Reddy Nagar, Railway Station Road, Kurnool.

