TGSRTC: తెలంగాణ ఆర్టీసీలో 1743 ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల
TGSRTC: తెలంగాణ ఆర్టీసీలో 1743 ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల. పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు నుంచి నోటిఫికేషన్ విడుదల అయింది. శ్రామిక్, డ్రైవర్ పోస్టులు భర్తీ చేస్తున్నారు. శ్రామిక 743 పోస్టులు, డ్రైవర్ 1,000 పోస్టులు భర్తీ చేస్తున్నారు. పదవ తరగతి, ఐటిఐ అర్హతలు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. డ్రైవర్ పోస్టులకు పదవ తరగతితో పాటు డ్రైవింగ్ లైసెన్స్, డ్రైవింగ్ అనుభవం కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
శ్రామిక పోస్టులకు 18 నుంచి 30 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. డ్రైవర్ పోస్టులకు 22 నుంచి 35 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
అర్హత కలిగిన అభ్యర్థులు www.tgprb.in వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. 2025 అక్టోబర్ 8వ తారీఖు నుంచి 28వ తారీకు వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. తెలంగాణ రాష్ట్రంలోని 33 జిల్లాలకు చెందిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. 33 జిల్లాల్లో ఖాళీలు భర్తీ చేస్తున్నారు.

