TG Revenue Department Jobs: తెలంగాణ రెవెన్యూ శాఖలో సర్వేయర్ ఉద్యోగాలు భర్తీ.. 1,000 పోస్టులు
తెలంగాణ రాష్ట్రంలో రెవెన్యూ శాఖలో విలేజ్ సర్వేయర్ ఉద్యోగాల భర్తీకి త్వరలో నోటిఫికేషన్ విడుదల. మొత్తం 1,000 పోస్టులను భర్తీ చేయనున్నట్లు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అసెంబ్లీ వేదికగా తెలిపారు. పెద్ద మండలాలకు ఇద్దరు చొప్పున సర్వేయర్లను కేటాయిస్తామని తెలిపారు. రాష్ట్రంలో 892 మంది సర్వేయర్లు ఉండాలని, కానీ ప్రస్తుతం 242 మంది మాత్రమే విధులు నిర్వర్తిస్తున్నారని తెలిపారు.
విలేజ్ సర్వేయర్ ఉద్యోగాలకు పదవ తరగతి అర్హతతో పాటు ఐటిఐ డ్రాఫ్ట్స్ మన్ సివిల్ సర్టిఫికెట్ కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. 18 నుంచి 44 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఇస్తారు. రాత పరీక్ష, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం..
ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తే సంస్థ
తెలంగాణ రెవెన్యూ శాఖ నుంచి ఉద్యోగాల భర్తీ చేపట్టనున్నారు
పోస్టుల వివరాలు:
ఈ నోటిఫికేషన్ ద్వారా 1,000 విలేజ్ సర్వేయర్ పోస్టులను భర్తీ చేయనున్నారు.
అర్హతల వివరాలు:
పదవ తరగతి పాసై, ఐటిఐ డ్రాఫ్ట్స్ మన్ సివిల్ సర్టిఫికెట్ కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.
Age ఎంత ఉండాలి?
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులకు 18 నుంచి 44 సంవత్సరాల లోపు వయస్సు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. దివ్యాంగులకు 10 సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
సెలక్షన్ ప్రాసెస్:
రాతపరీక్ష మరియు ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
Apply చేయు విధానం:
ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తిస్థాయి నోటిఫికేషను విడుదలైన తర్వాత, అధికారిక వెబ్సైట్లో ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల వారు ఈ ఉద్యోగాలు దరఖాస్తు చేసుకోవచ్చు.
క్రింది లింక్ పై క్లిక్ చేసి ఈ ఉద్యోగాలకు సంబంధించిన ఖాళీల వివరాలు తెలుసుకోవచ్చు
✅తెలంగాణ నిరుద్యోగుల కోసం: SI/కానిస్టేబుల్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, SSC GD Constable, RPF SI/కానిస్టేబుల్” ఆన్లైన్ కోచింగ్ “కేవలం 499 రూపాయలకే” అందించడం జరుగుతోంది. క్రింది లింక్ పై క్లిక్ చేసి APP install చేసుకుని, మీకు కావాల్సిన కోర్స్ తీసుకోండి.
✅మీ వాట్సాప్ (లేదా) టెలిగ్రామ్ కి “ప్రతిరోజు జాబ్ అప్డేట్స్, కరెంట్ అఫైర్స్ అప్డేట్స్” రావాలి అంటే.. క్రింది లింక్ పై క్లిక్ చేసి గ్రూపులో జాయిన్ అవ్వండి.