తెలంగాణ గనులు & భూగర్భ శాఖలో 50,000 జీతంతో అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ | TG Outsourcing Jobs
Telangana Outsourcing Jobs
Telangana Outsourcing Jobs: తెలంగాణ రాష్ట్రంలో గనులు & భూగర్భ శాఖలో అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. జూనియర్ జియాలజిస్ట్ పోస్టులను భర్తే చేస్తున్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు స్వయంగా మరియు ఈమెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఎమ్మెస్సీ జియాలజీతో పాటు అనుభవం కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ ఉద్యోగాలకు ఎంపికే అభ్యర్థులకు నెలకు జీతం 50 వేల రూపాయలు ఉంటుంది. ఎటువంటి రాత పరీక్ష ఉండదు, ఫీజు ఉండదు.. ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అర్హత కలిగిన అభ్యర్థులు జనవరి 16వ తారీకు లోపు దరఖాస్తు చేసుకోవాలి.
నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ
తెలంగాణ ప్రభుత్వం, గనులు & భూగర్భ శాఖ నుంచి అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన జూనియర్ జియాలజిస్ట్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
పోస్టుల వివరాలు
ఈ నోటిఫికేషన్ ద్వారా జూనియర్ జియాలజిస్ట్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 2 పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు.
విద్యార్హతలు
M.Sc. జియాలజీ అర్హతతో పాటు.. జిలాజికల్ మ్యాపింగ్, ఎక్స్ ప్లోరేషన్, రిసోర్స్ ఎస్టిమేషన్లో కనీసం మూడు సంవత్సరాల అనుభవం కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవటానికి అవకాశం ఉంటుంది. మినరల్ బ్లాక్ ల వేలంలో మొదలగు వాటిలో పరిజ్ఞానం కలిగిన వారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది.
జీతభత్యాలు
ఈ ఉద్యోగాలకు ఎంపిక అయ్యే అభ్యర్థులకు నెలకు జీతం రూ.50,000/- ఉంటుంది.
ఎంపిక విధానం
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులలో అర్హతలు, అనుభవాన్ని ఆధారంగా చేసుకుని షార్ట్ లిస్ట్ చేస్తారు.. షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్థులకు ఇంటర్వ్యూ నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఎటువంటి రాత పరీక్ష ఉండదు.
దరఖాస్తు విధానం
ఈ ఉద్యోగాలకు స్వయంగా మరియు ఈమెయిల్ ద్వారా.. రెండు విధాలుగా దరఖాస్తు చేయాలి.
దరఖాస్తుకు చివరి తేదీ
అర్హత కలిగిన అభ్యర్థులు 2026 జనవరి 16వ తారీకు లోపు దరఖాస్తు చేసుకోవాలి.
క్రింది లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి
Also Read: RRB Group D Notification 2026 Details


