తెలంగాణలో హోంగార్డు ఉద్యోగాల భర్తీ | TS Home Guard Recruitment 2024
TS Home Guard Jobs: తెలంగాణ రాష్ట్రంలో పోలీసు శాఖలో హోంగార్డు ఉద్యోగాల భర్తీకి వెంటనే చర్యలు చేపట్టాలని.. ఈ ప్రక్రియ మూడు నెలల్లో పూర్తి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించారు.
✅తెలంగాణ నిరుద్యోగుల కోసం “TS ఎస్సై/కానిస్టేబుల్, గ్రూప్-2, గ్రూప్-3” ఆన్లైన్ కోచింగ్ “కేవలం 499 రూపాయలకే” అందించడం జరుగుతోంది. మీకు కావలసిన కోర్సు కోసం క్రింది యాప్ లింక్ పై క్లిక్ చేయండి.
తెలంగాణ రాష్ట్రంలో పోలీసు శాఖలో హోంగార్డు ఉద్యోగాల భర్తీకి వెంటనే చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించారు. బుధవారం గ్రేటర్ హైదరాబాద్ లో ట్రాఫిక్ నియంత్రణకు సంబంధించి సచివాలయంలో సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా.. నగరంలో పెరిగిన వాహనాల సంఖ్యకు అనుగుణంగా ట్రాఫిక్ సిబ్బంది అందుబాటులో లేరని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి.. ట్రాఫిక్ కు అవసరమైన మేర హోంగార్డుల నియామకాలు చేపట్టాలని ఆదేశించారు. ఈ ప్రక్రియను మూడు నెలల్లోగా పూర్తిచేయాలని, వారికి తగిన శిక్షణ ఇవ్వాలన్నారు. ఉద్యోగ నియామకాలను అత్యంత పారదర్శకంగా, ఎలాంటి అవకతవకలకు ఆస్కారం లేకుండా చేపట్టాలని సీఎం ఆదేశించారు. హైదరాబాద్ మహానగరంలో పెరుగుతున్న ట్రాఫిక్ ను నియంత్రించేందుకు పోలీసు విభాగం సమగ్ర ప్రణాళికను రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
✅తెలంగాణ నిరుద్యోగుల కోసం “TS ఎస్సై/కానిస్టేబుల్, గ్రూప్-2, గ్రూప్-3” ఆన్లైన్ కోచింగ్ “కేవలం 499 రూపాయలకే” అందించడం జరుగుతోంది. మీకు కావలసిన కోర్సు కోసం క్రింది యాప్ లింక్ పై క్లిక్ చేయండి.
✅మీ వాట్సాప్ (లేదా) టెలిగ్రామ్ కి “ప్రతిరోజు జాబ్ అప్డేట్స్, కరెంట్ అఫైర్స్ అప్డేట్స్” రావాలి అంటే.. క్రింది లింక్ పై క్లిక్ చేసి గ్రూపులో జాయిన్ అవ్వండి.