Telangana Court Jobs: 10th అర్హతతో తెలంగాణ జిల్లా కోర్టులో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
Telangana Court Jobs: తెలంగాణ రాష్ట్రం, డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ, సంగారెడ్డి నుండి రికార్డ్ అసిస్టెంట్, స్టెనో/ టైపిస్ట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. 10th క్లాస్, డిగ్రీ అర్హతలు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అర్హత కలిగిన అభ్యర్థులు డిసెంబర్ 7వ తారీకు లోపు Offline ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఈ నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ
గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ, సంగారెడ్డి నుంచి నోటిఫికేషన్ విడుదలైంది.
భర్తీ చేస్తున్న పోస్టుల వివరాలు
స్టెనో/ టైపిస్ట్: 01
రికార్డ్ అసిస్టెంట్: 01
మొత్తం పోస్టుల సంఖ్య: 02
విద్యార్హతల వివరాలు
స్టెనో/ టైపిస్ట్: ఈ ఉద్యోగాలకు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి ఆర్ట్స్ లేదా సైన్స్ లేదా కామర్స్ లేదా లా విభాగంలో డిగ్రీ విద్యార్హత కలిగి.. ఇంగ్లీషులో టైప్ రైటింగ్ హయ్యర్ గ్రేడ్ సర్టిఫికెట్, షార్ట్ హ్యాండ్ సర్టిఫికేట్ కలిగి, కంప్యూటర్ పరిజ్ఞానం కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
రికార్డ్ అసిస్టెంట్: ఈ ఉద్యోగాలకు 10th క్లాస్ విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
Age ఎంత ఉండాలి? Age Relaxation వివరాలు
శ్రీ ఉద్యోగాలకు 18 నుంచి 34 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, EWS అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు వయోపరిమితలో సడలింపు ఉంటుంది.
సెలక్షన్ ప్రాసెస్
స్టెనో/ టైపిస్ట్: రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
రికార్డ్ అసిస్టెంట్: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
ఎలా Apply చేయాలి?
అర్హత కలిగిన అభ్యర్థులు Offline ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. క్రింది నోటిఫికేషన్ లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని.. నోటిఫికేషన్ తో పాటు ఉన్న దరఖాస్తు ఫారం ప్రింట్ తీసుకొని అప్లై చేసుకోగలరు.
అప్లికేషన్ ఫీజు/ పరీక్ష ఫీజు
ఓసి, బీసీ అభ్యర్థులు 800 రూపాయలు ఫీజు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు 400 రూపాయలు ఫీజు చెల్లించాలి.
దరఖాస్తులు పంపుటకు చివరి తేదీ
అర్హత కలిగిన అభ్యర్థులు 07.12.2024 తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులు పంపవలసిన చిరునామా
చైర్మన్, డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ, న్యాయ సేవా సదన్, డిస్ట్రిక్ట్ కోర్ట్ ప్రెమిసెస్, సంగారెడ్డి.
క్రింది లింక్ పై క్లిక్ చేసి పూర్తీ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని, పూర్తీ వివరాలు చదివి ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోగలరు
✅తెలంగాణ నిరుద్యోగుల కోసం: SI/కానిస్టేబుల్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, SSC GD Constable “ఆన్లైన్ కోచింగ్ “కేవలం 499 రూపాయలకే” అందించడం జరుగుతోంది. క్రింది లింక్ పై క్లిక్ చేసి APP install చేసుకుని, మీకు కావాల్సిన కోర్స్ తీసుకోండి.