కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో 10th, ఇంటర్, డిగ్రీ అర్హతలతో పర్మినెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల | SSC Phase 12 Notification 2024
SSC Recruitment 2024: స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి ఉద్యోగాల భర్తీకి మరో కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో 2,049 పోస్టులను భర్తీ చేస్తున్నారు. 10th, ఇంటర్ డిగ్రీ అర్హతల వారు దరఖాస్తు చేసుకోవచ్చు.
✅నిరుద్యోగులకు కోసం: “RPF SI, Constable” Full Course + Test Series కేవలం “499 రూపాయలకే” అందించడం జరుగుతోంది. 738 వీడియోలు, 65 టెస్టులు, 156 PDFలు ఉంటాయి. Full Course + Test Series కోసం క్రింది యాప్ లింక్ పై క్లిక్ చేయండి.
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఉద్యోగాల భర్తీకి Phase-XII/2024 నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పరీక్ష ద్వారా వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖల్లోని మొత్తం 489 ప్రభుత్వ విభాగాల్లో ఖాళీలను భర్తీ చేస్తున్నారు. మొత్తం 2,049 ఉద్యోగాల భర్తీకి ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. 10th క్లాస్, ఇంటర్మీడియట్, డిగ్రీ విద్యార్హతలు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. రాతపరీక్ష, స్కిల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అర్హత, వయస్సు, దరఖాస్తు, ఎంపిక విధానం వివరాలు తెలుసుకుందాం..
ఖాళీలు గల విభాగాలు:
సెంట్రల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా, రీజనల్ డ్రగ్స్ టెస్టింగ్ లాబొరేటరీ, సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ, సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డ్, సెంట్రల్ వాటర్ కమిషన్, రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ మినిస్ట్రీ, హోం అఫైర్స్ మినిస్ట్రీ, డిఫెన్స్ మినిస్ట్రీ, డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిషరీస్, సెంట్రల్ ట్రాన్స్ లేషన్ బ్యూరో, డిపార్ట్మెంట్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్, డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్, డిపార్ట్మెంట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్, నీతి ఆయోగ్, డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ.. తదితర విభాగాల్లో ఖాళీలను భర్తీ చేస్తున్నారు.
పోస్టుల వివరాలు:
లైబ్రరీ అటెండెంట్, మెడికల్ అటెండెంట్, నర్సింగ్ ఆఫీసర్, ఫార్మసిస్ట్, ఫీల్డ్మ్యన్, అకౌంటెంట్, అసిస్టెంట్ ప్లాంట్ ప్రొటెక్షన్ ఆఫీసర్, ల్యాబొరేటరీ అటెండెంట్, ఫోర్మాన్, జూనియర్ ఇంజినీర్, యూడీసీ, డ్రైవర్-కమ్ మెకానిక్, టెక్నికల్ అసిస్టెంట్, సూపర్వైజర్, సీనియర్ ట్రాన్స్టర్, స్టోర్ కీపర్, రిసెర్చ్ ఇన్వెస్టిగేటర్, కోర్ట్ క్లర్క్, క్యాంటీన్ అటెండెంట్, కేర్ టేకర్, అకౌంట్స్ క్లబ్.. తదితర పోస్టులను భర్తీ చేస్తున్నారు.
మొత్తం పోస్టుల సంఖ్య: 2,049
విద్యార్హతలు:
పోస్ట్ ను అనుసరించి పదవ తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ, డిప్లొమా విద్యార్హతలు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
వయోపరిమితి:
పోస్టులను అనుసరించి 18 నుంచి 30 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, బీసీ అభ్యర్థులకు మూడు సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
ఎంపిక విధానం:
కంప్యూటర్ ఆధారిత పరీక్ష, స్కిల్ టెస్ట్, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
పరీక్ష విధానం:
200 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు.
జనరల్ ఇంటెలిజెన్స్ (25 ప్రశ్నలు, 50 మార్కులు),
జనరల్ అవేర్నెస్ (25 ప్రశ్నలు, 50 మార్కులు),
క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ (25 ప్రశ్నలు, 50మార్కులు),
ఇంగ్లిష్ లాంగ్వేజ్ (25 ప్రశ్నలు, 50 మార్కులు).
ప్రతి తప్పు సమాధానానికి 0.50 మార్కుల నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది.
పరీక్ష వ్యవధి: 60 నిమిషాలు ఉంటుంది.
దరఖాస్తు విధానం:
ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు:
రూ.100/- ఫీజు చెల్లించాలి.
ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది.
దరఖాస్తుకు చివరి తేదీ:
2024 మార్చి 18వ తారీకు లోపు దరఖాస్తు చేసుకోవాలి.
ముఖ్య గమనిక: ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసే అభ్యర్థులు, పూర్తి నోటిఫికేషన్ చదివి అర్హత ఉంటే అప్లై చేయండి.
క్రింది లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి
✅నిరుద్యోగులకు కోసం: “RPF SI, Constable” Full Course + Test Series కేవలం “499 రూపాయలకే” అందించడం జరుగుతోంది. 738 వీడియోలు, 65 టెస్టులు, 156 PDFలు ఉంటాయి. Full Course + Test Series కోసం క్రింది యాప్ లింక్ పై క్లిక్ చేయండి.
✅ప్రతిరోజు లేటెస్ట్ జాబ్ అప్డేట్స్, కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ కోసం వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూపులో జాయిన్ అవ్వండి