Head Constable Jobs: 914 హెడ్ కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. అర్హత, వయస్సు, దరఖాస్తు, ఎంపిక విధానం వివరాలు
గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్, ససస్త్ర సీమా బల్ నుంచి హెడ్ కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి షార్ట్ నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 914 పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఎలక్ట్రీషియన్, మెకానిక్, స్టెవార్డ్, వెటర్నరీ, కమ్యూనికేషన్ విభాగాల్లో ఖాళీగా ఉన్న హెడ్ కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఇంటర్మీడియట్, ఐటిఐ, డిప్లమా విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
పోస్టుల వివరాలు:
హెడ్ కానిస్టేబుల్ (ఎలక్ట్రీషియన్): 15
హెడ్ కానిస్టేబుల్ (మెకానిక్): 296
హెడ్ కానిస్టేబుల్ (స్టెవార్డు): 02
హెడ్ కానిస్టేబుల్ (వెటర్నరీ): 23
హెడ్ కానిస్టేబుల్ (కమ్యూనికేషన్): 578
మొత్తం పోస్టులు: 914
విద్యార్హతలు:
పోస్టును అనుసరించి ఇంటర్మీడియట్, ఐటిఐ, డిప్లమా విద్యార్హతలు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
వయోపరిమితి:
హెడ్ కానిస్టేబుల్ (ఎలక్ట్రీషియన్, స్టెవార్డ్, వెటర్నరీ, కమ్యూనికేషన్) పోస్టులకు 18 నుంచి 25 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
హెడ్ కానిస్టేబుల్ (మెకానిక్) పోస్టులకు 21 నుంచి 27 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
జీతభత్యాలు:
నెలకు రూ.25,500/- నుంచి రూ.81,100/- వరకు ఉంటుంది. ఇతర అలవెన్సులు కూడా ఉంటాయి.
దరఖాస్తు ఫీజు/ అప్లికేషన్ ఫీజు:
రూ.100/- చెల్లించాలి.
(ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది)
ఎంపిక విధానం:
రాతపరీక్ష, ఫిజికల్ టెస్ట్, ట్రేడ్ టెస్ట్, మెడికల్ టెస్టులు, ధ్రువపత్రాల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం:
ఎంప్లాయిమెంట్ న్యూస్ ద్వారా పూర్తి స్థాయి నోటిఫికేషన్ విడుదలైన తరువాత 30 రోజులలోపు దరఖాస్తు చేసుకోవాలి.
Note: ఎంప్లాయిమెంట్ న్యూస్ & Official Website ద్వారా పూర్తి స్థాయి నోటిఫికేషన్ విడుదలైన తరువాత అభ్యర్థులు సిలబస్, ఫిజికల్ టెస్టుల వివరాలు తెలుసుకోగలరు.
క్రింది లింక్ పై క్లిక్ చేసి షార్ట్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి
ప్రతిరోజు లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి