RRB Group D Notification 2026: రైల్వేలో 22 వేల గ్రూప్-డి ఉద్యోగాలు భర్తీకి మరో కొత్త నోటిఫికేషన్ విడుదల
RRB Group D Notification 2026 Details
RRB Group D Notification 2026: రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ నుంచి గ్రూప్-డి (లెవెల్ 01) ఉద్యోగాలు భర్తీకి షార్ట్ నోటిఫికేషన్ విడుదలైంది. దేశవ్యాప్తంగా అన్ని రైల్వే రీజియన్లలో మొత్తం 22 వేల ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. 10వ తరగతి, ఐటిఐ విద్యార్హతలు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. తెలుగు రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు సికింద్రాబాద్ రైల్వే జోన్ లో ఉన్న ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సికింద్రాబాద్ రైల్వే జోన్ లో 1,000 పైగా ఖాళీలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు తెలుగు భాషలోనూ పరీక్ష రాయడానికి అవకాశం ఉంటుంది. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా 2026 ఫిబ్రవరి 20వ తారీకు లోపు దరఖాస్తు చేసుకోవాలి.
నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ
రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి గ్రూప్-డి లెవెల్ వన్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
పోస్టుల వివరాలు
ఈ నోటిఫికేషన్ ద్వారా రైల్వే శాఖలో దేశవ్యాప్తంగా అన్ని రీజియన్లలో మొత్తం 22,000 గ్రూప్-డి లెవెల్ వన్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.
Age limit
ఈ ఉద్యోగాలకు 18 నుంచి 33 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవటానికి అవకాశం ఉంటుంది ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు, బీసీ అభ్యర్థులకు మూడు సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు కల్పిస్తారు.
Salary
రైల్వే గ్రూప్ డి ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు జీతం నెలకు రూ.18,000 (7th CPC పే మ్యాట్రిక్స్ ప్రకారం) ఉంటుంది. అలాగే రైల్వే శాఖకు సంబంధించిన ఇతర అలవెన్స్ కూడా ఉంటాయి. అవన్నీ కలుపుకొని జీతం దాదాపు రూ.30,000 వరకు రావచ్చు.
Selection Process
కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్, ఫిజికల్ టెస్టులు, మెడికల్ టెస్ట్లు, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. కంప్యూటర్ ఆధారిత పరీక్ష ఇంగ్లీష్ భాషతో పాటు తెలుగు భాషలోనే ఉంటుంది. తెలుగు మీడియం అభ్యర్థులు తెలుగు భాషలోనూ పరీక్ష రాయవచ్చు.
దరఖాస్తు విధానం
రైల్వే గ్రూప్ డి ఉద్యోగాలకు అర్హత కలిగిన అభ్యర్థులు www.rrbapply.gov.in వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు తేదీలు
రైల్వే గ్రూప్ డి ఉద్యోగాలకు 21-01-2026 తేదీ నుంచి 20-02-2026 తేదీ లోపు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
క్రింది లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి ( RRB Group D Notification 2026 )
Also Read: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంగన్వాడీ ఉద్యోగాలు భర్తీ

