రైల్వే శాఖలో 5,696 అసిస్టెంట్ లోకో పైలట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల | RRB ALP Recruitment 2024
RRB ALP Recruitment 2024: రైల్వే శాఖ నుంచి ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 5,696 అసిస్టెంట్ లోకో పైలట్(ALP) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు.
✅నిరుద్యోగులకు సంక్రాంతి ఆఫర్: “RPF Constable” Full Course + Test Series కేవలం “499 రూపాయలకే” అందించడం జరుగుతోంది. 738 వీడియోలు, 65 టెస్టులు, 156 PDFలు ఉంటాయి. Full Course + Test Series కోసం క్రింది యాప్ లింక్ పై క్లిక్ చేయండి.
రైల్వే శాఖ నుంచి అసిస్టెంట్ లోకో పైలట్(ALP) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. దేశవ్యాప్తంగా అన్ని రీజియన్లలో మొత్తం 5,696 పోస్టులను భర్తీ చేస్తున్నారు. సికింద్రాబాద్ రీజియన్ లో 758 ఖాళీలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ.. రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన అభ్యర్థులు సికింద్రాబాద్ రీజియన్ లో ఉన్నటువంటి ఖాళీలకు దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత కలిగిన అభ్యర్థులు జనవరి 20 నుంచి ఫిబ్రవరి 19 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. అర్హత, వయస్సు, జీతం, దరఖాస్తు, ఎంపిక విధానం వివరాలు తెలుసుకుందాం..
పోస్టుల వివరాలు:
అసిస్టెంట్ లోకో పైలట్ (ALP): 5,696 పోస్టులు
విద్యార్హతలు:
10th క్లాస్ అర్హతతో పాటు ఐటీఐ(ఫిట్టర్/ ఎలక్ట్రిషియన్/ ఇన్స్ట్రుమెంట్ మెకానిక్/ మిల్ రైట్/ మెయింటెనెన్స్ మెకానిక్/ మెకానిక్- రేడియో అండ్ టీవీ/ ఎలక్ట్రానిక్స్ మెకానిక్/ మెకానిక్- మోటార్ వెహికల్/ వైర్ మ్యాన్/ ట్రాక్టర్ మెకానిక్/ ఆర్మేటర్ అండ్ కాయిల్ వైండర్/ మెకానిక్- డీజిల్/ హీట్ ఇంజిన్/ టర్నర్/ మెషినిస్ట్/ రిఫ్రిజెరేషన్ అండ్ ఎయిర్ కండీషనింగ్ మెకానిక్) అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. (లేదా) మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్ ఇంజినీరింగ్ విభాగాల్లో మూడేళ్ల డిప్లొమా చేసినవారూ దరఖాస్తు చేసుకోవచ్చు.
వయోపరిమితి:
2024 జులై 1 వ తారీకు నాటికి 18 నుంచి 30 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
SC/ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు, BC అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
జీతభత్యాలు:
నెలకు రూ.19900/- నుంచి రూ.63200/- వరకు
ఎంపిక విధానం:
రాతపరీక్ష(CBT-1,2), కంప్యూటర్ బేస్డ్ ఆప్టిట్యూడ్ టెస్ట్, ధ్రువపత్రాల పరిశీలన, మెడికల్ టెస్టుల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం:
ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి
దరఖాస్తు ఫీజు:
SC/ST/EBC/ మహిళా అభ్యర్థులు రూ.250/- ఫీజు చెల్లించాలి. ఇతరులు రూ.500/- ఫీజు చెల్లించాలి.
దరఖాస్తుకు చివరి తేదీ:
2024 ఫిబ్రవరి 19వ తారీకు లోపు దరఖాస్తు చేసుకోవాలి.
క్రింది లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి
✅నిరుద్యోగులకు సంక్రాంతి ఆఫర్: “RPF Constable” Full Course + Test Series కేవలం “499 రూపాయలకే” అందించడం జరుగుతోంది. 738 వీడియోలు, 65 టెస్టులు, 156 PDFలు ఉంటాయి. Full Course + Test Series కోసం క్రింది యాప్ లింక్ పై క్లిక్ చేయండి.
✅ప్రతిరోజు లేటెస్ట్ జాబ్ అప్డేట్స్, కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ కోసం వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూపులో జాయిన్ అవ్వండి