RBI Assistant Posts: తెలుగు భాష రావాలి.. రిజర్వు బ్యాంకులో అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
RBI Assistant Recruitment 2023: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి 450 అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) నుంచి.. దేశవ్యాప్తంగా ఆర్బీఐ శాఖల్లో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా 450 ఉద్యోగాలు భర్తీ కానున్నాయి. ఏదైనా డిగ్రీ విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. తెలుగు భాష కచ్చితంగా వచ్చి ఉండాలి. ప్రిలిమినరీ, మెయిన్ ఎగ్జామినేషన్, లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఎంపికైన అభ్యర్థులు దేశవ్యాప్తంగా ఉన్న ఆర్బీఐ శాఖల్లో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. అర్హత, వయస్సు, జీతం, దరఖాస్తు, ఎంపిక విధానం వివరాలు తెలుసుకుందాం..
పోస్టుల వివరాలు:
అసిస్టెంట్ పోస్టులు : 450
శాఖల వారీగా ఖాళీలు:
అహ్మదాబాద్- 13
భువనేశ్వర్- 19
బెంగళూరు- 58
భోపాల్ – 12
చండీగఢ్- 21
చెన్నై- 1
హైదరాబాద్- 14
గువాహటి- 26
జైపూర్- 5
జమ్మూ- 18
కాన్పుర్, లక్నో- 55
కలకత్తా- 22
ముంబయి- 101
నాగపూర్- 19
న్యూదిల్లీ- 28
పాట్నా- 1
తిరువనంతపురం, కొచ్చి- 16
మొత్తం ఖాళీల సంఖ్య: 450.
విద్యార్హతలు:
ఏదైనా డిగ్రీ విద్యార్హతతో పాటు పీసీ వర్డ్ ప్రాసెసింగ్ పరిజ్ఞానం కలిగి ఉండాలి. అలాగే సంబంధిత రాష్ట్ర భాషలో ప్రావీణ్యం తప్పనిసరి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అభ్యర్థులకు ‘తెలుగు భాష’ కచ్చితంగా వచ్చి ఉండాలి.
వయోపరిమితి:
01-09-2023 నాటికి 20 నుంచి 28 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు అయిదేళ్లు; ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్లు; దివ్యాంగ అభ్యర్థులకు పదేళ్ల(జనరల్) వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
జీతభత్యాలు:
నెలకు రూ.20,700 నుంచి రూ.55700 .
ఎంపిక విధానం:
ప్రిలిమినరీ, మెయిన్ ఎగ్జామినేషన్, లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం:
ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు:
రూ.450/- ఫీజు చెల్లించాలి.
SC/ ST అభ్యర్థులు రూ.50/- ఫీజు చెల్లించాలి.
దరఖాస్తు తేదీలు:
2023 సెప్టెంబర్ 13వ తారీకు నుంచి 2023 అక్టోబర్ 4వ తారీకు వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
క్రింది లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి
ప్రతిరోజు లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ గ్రూపులో జాయిన్ అవ్వండి
అతి తక్కువ ధరలో గ్రూప్-2, గ్రామ సచివాలయం, AP SI/Constable Mains ఆన్లైన్ కోచింగ్ కోసం క్రింది యాప్ లింక్ పై క్లిక్ చేయండి.