AP Job Mela 2024: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాతపరీక్ష లేకుండా ఉద్యోగాల భర్తీ | అర్హతలు: 10th, Inter, Degree, ITI, Diploma, B.Tech
AP Job Mela: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వివిధ కంపెనీలలో ఉద్యోగాల భర్తీకి జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. 10th క్లాస్, ఇంటర్మీడియట్, ఐటీఐ, డిప్లమో, ఏదైనా డిగ్రీ, బీటెక్ విద్యార్హత కలిగిన అభ్యర్థులు ఈ మేళాలో పాల్గొనవచ్చు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, పార్వతీపురంలోని శ్రీ వేంకటేశ్వర ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈ నెల 23న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ చలపతిరావు తెలిపారు. ఈ జాబ్ మేళాలో పాల్గొనే ఐసీఐసీఐ బ్యాంక్, HDB ఫైనాన్షియల్ సర్వీస్, డెక్కన్ కెమికల్స్, ఫాక్స్కాన్, ఆల్ స్టామ్, డైకీ అల్యూమినియమ్ ఇండస్ట్రీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలలో రిలేషన్షిప్ మేనేజర్, బిజినెస్ ఎగ్జిక్యూటివ్, టెక్నీషియన్ ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
విద్యార్హతలు:
10th క్లాస్, ఇంటర్మీడియట్, ఐటీఐ, డిప్లమో, ఏదైనా డిగ్రీ, బీటెక్ ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈ జాబ్ మేళాలో పాల్గొనవచ్చు.
వయోపరిమితి:
18 నుంచి 35 సంవత్సరాలలోపు వయస్సు కలిగిన అభ్యర్థులు జాబ్ మేళాకు అర్హులు.
ఇంటర్వ్యూ నిర్వహణ తేదీ:
2024 మే 23వ తేదీ ఉదయం 9 గంటలకు సర్టిఫికెట్ల జిరాక్స్ కాపీలతో హాజరుకావాలి. మరిన్ని వివరాలకు ఫోన్ 9440127517 నంబర్లో సంప్రదించవచ్చు.
క్రింది లింక్ పై క్లిక్ చేసి పత్రికాముఖంగా వచ్చిన నోటిఫికేషన్ వివరాలు డౌన్లోడ్ చేసుకోగలరు