IB Recruitment: 10th క్లాస్ అర్హతతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ | సెక్యూరిటీ అసిస్టెంట్ & MTS పోస్టులు
గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్, ఇంటెలిజెన్స్ బ్యూరో నుంచి ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. సెక్యూరిటీ అసిస్టెంట్ & MTS పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 1,675 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కూడా ఖాళీలు ఉన్నాయి. ప్రాంతీయ భాష (తెలుగు) వచ్చినవారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి పదవ తరగతి పాసైన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. www.mha.gov.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
పోస్టుల వివరాలు:
సెక్యూరిటీ అసిస్టెంట్: 1,525 పోస్టులు
MTS: 150 పోస్టులు
మొత్తం: 1,675 పోస్టులు
(హైదరాబాదులో 48 పోస్టులు, విజయవాడలో 7 పోస్టులు ఖాళీలు ఉన్నాయి).
దరఖాస్తు విధానం:
2023 జనవరి 28 నుండి 2023 ఫిబ్రవరి 17 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. www.mha.gov.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
విద్యార్హతలు:
10th క్లాస్ పాసైన వారు దరఖాస్తు చేసుకోవచ్చు.
ప్రాంతీయ భాష తెలుగు చదవడం, రాయడం, మాట్లాడడం వచ్చి ఉండాలి.
జీతభత్యాలు:
సెక్యూరిటీ అసిస్టెంట్: 21,700/- నుంచి 69,100/-
MTS పోస్టులు: 18,000/- నుంచి 56,900/-
వయోపరిమితి:
సెక్యూరిటీ అసిస్టెంట్ పోస్టులు: 18 నుంచి 27 సంవత్సరాల లోపు ఉండాలి.
MTS పోస్టులు: 18 నుంచి 25 సంవత్సరాల లోపు ఉండాలి.
SC, ST అభ్యర్థులకు వయోపరిమితిలో ఐదు సంవత్సరాలు, BC అభ్యర్థులకు మూడు సంవత్సరాలు సడలింపు ఉంటుంది.
దరఖాస్తు/పరీక్ష ఫీజు:
₹.500/- ఫీజు ఆన్లైన్ ద్వారా చెల్లించాలి.
ఎంపిక విధానం:
సెక్యూరిటీ అసిస్టెంట్: Tier-1 కంప్యూటర్ ఆధారిత పరీక్ష, Tier-2 ఆఫ్లైన్ విధానంలో డిస్క్రిప్టివ్ పరీక్ష & Tier-3 ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు
MTS పోస్టులు: Tier-1 కంప్యూటర్ ఆధారిత పరీక్ష & Tier-2 ఆఫ్లైన్ విధానంలో డిస్క్రిప్టివ్ టైప్ పేపర్ పరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
Tier-1 పరీక్ష విధానం:
ఒకే పరీక్ష ఉంటుంది. ఆబ్జెక్టివ్ విధానంలో నిర్వహిస్తారు. ప్రశ్నపత్రంలో 100 ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో పరీక్షకు ఒక మార్కు చొప్పున మొత్తం 100 మార్కులకు పరీక్ష ఉంటుంది.
క్రింది లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోగలరు