September 10, 2024
AP Govt JobsPolice/Defence

AP పోలీస్ కానిస్టేబుల్ పరీక్షకు హాజరయ్యే వారు పాటించాల్సిన నిబంధనలు.. పరీక్షకు తీసుకెళ్లాల్సినవి.. తీసుకెళ్లకూడనివి

కానిస్టేబుల్ అభ్యర్థులు పాటించాల్సిన నిబంధనలు

◆ కానిస్టేబుల్ అభ్యర్థులు ఒకరోజు ముందుగానే తమ పరీక్ష కేంద్రాన్ని సందర్శించి నిర్ధారించుకోవాలి.

◆ అభ్యర్థులను ఆదివారం ఉదయం తొమ్మిది గటల నుంచి పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తారు.

◆ అభ్యర్థులు ఉదయం 10 గంటల తర్వాత ఒక నిమిషం ఆలస్యమైనా పరీక్ష హాల్లోకి అనుమతించరు.

◆ మొబైల్ ఫోన్, సెల్ ఫోన్, ట్యాబ్ లు, ల్యాబ్ టాప్, పెన్ డ్రైవ్, బ్లూటూత్ పరికరాలు, వాచ్, క్యాలిక్యులేటర్లు, వాలెట్, పర్సులు, ఏ రకమైన పేపర్, రికార్డింగ్ పరికరాలు, ఎలక్ట్రానిక్ పరికరాలు పరీక్ష కేంద్రంలోకి అనుమతించరు.

◆ పరీక్ష కేంద్రాల వద్దకు తీసుకురాకూడదని, వాటిని భద్రపరిచేందుకు ఏ విధమైన అదనపు ఏర్పాట్లు ఉండవని రిక్రూట్మెంట్ బోర్డ్ స్పష్టం చేసింది.

◆ అభ్యర్థులు గుర్తింపు ఆధార్ కార్డు, పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ కార్డు, రేషన్ కార్డు తదితర వాటిలో ఏదైనా ఒరిజినల్ ఫోటో గుర్తింపు కార్డు పరీక్ష కేంద్రానికి తీసుకురావాల్సి ఉంటుంది.

◆ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు హాల్ టికెట్, బ్లూ/బ్లాక్ బాల్ పాయింట్ పెన్ తీసుకురావాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!