49వేల జీతంతో తెలంగాణలో పర్మినెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల | CCMB Recruitment 2024
CSIR – CCMB Recruitment: తెలంగాణ రాష్ట్రం, హైదరాబాదులోని CSIR CCMB నుంచి జూనియర్ స్టెనోగ్రాఫర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇంటర్మీడియట్ అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
✅ప్రతిరోజు లేటెస్ట్ జాబ్ అప్డేట్స్, కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ కోసం వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూపులో జాయిన్ అవ్వండి
తెలంగాణ రాష్ట్రం, హైదరాబాద్ లోని సీఎస్ఐఆర్- సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ(CCMB) నుంచి జూనియర్ స్టెనోగ్రాఫర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇంటర్మీడియట్(10+2) అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. స్టెనోగ్రఫీ వచ్చి ఉండాలి. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అర్హత, వయస్సు, జీతం, దరఖాస్తు, ఎంపిక విధానం వివరాలు తెలుసుకుందాం..
పోస్టుల వివరాలు:
జూనియర్ స్టెనోగ్రాఫర్: 05 పోస్టులు
విద్యార్హతలు:
ఇంటర్మీడియట్ (10+2/ పన్నెండో తరగతి) ఉత్తీర్ణతతో పాటు స్టెనోగ్రఫీలో నైపుణ్యం కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
వయోపరిమితి:
27 సంవత్సరాలలోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
SC/ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు. BC అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
జీతభత్యాలు:
నెలకు రూ.49,371/- జీతం ఉంటుంది.
ఎంపిక విధానం:
రాతపరీక్ష, స్కిల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం:
ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు:
రూ.100/- ఫీజు చెల్లించాలి.
ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది.
దరఖాస్తుకు చివరి తేదీ:
2024 జనవరి 20వ తారీకు లోపు దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు హార్డ్ కాపీ స్వీకరణకు చివరి తేదీ:
2024 జనవరి 29వ తారీకు లోపు దరఖాస్తు హార్డ్ కాపీ పంపాలి.
క్రింది లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి
✅అతి తక్కువ ధరలో “TS Group-2,3,4; TS SI/Constable, SSC GD Constable, RPF Constable” ఆన్లైన్ కోచింగ్ కోసం క్రింది యాప్ లింక్ పై క్లిక్ చేయండి.
✅ప్రతిరోజు లేటెస్ట్ జాబ్ అప్డేట్స్, కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ కోసం వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూపులో జాయిన్ అవ్వండి