1,29,929 కానిస్టేబుల్ ఉద్యోగాల రాతపరీక్ష సిలబస్.. PDF డౌన్లోడ్ చేసుకోండి
సీఆర్పీఎఫ్ 1,29,929 కానిస్టేబుల్ జీడీ (జనరల్ డ్యూటీ) పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేస్తామని కేంద్రం ఇటీవల ప్రకటించింది. పదవ తరగతి విద్యార్హత కలిగిన అభ్యర్థులు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. 18 నుంచి 23 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. కంప్యూటర్ ఆధారిత పరీక్ష, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, మెడికల్ టెస్ట్, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
ప్రస్తుతం పోటీ ఎక్కువగా ఉండటం వల్ల ముందుగానే పరీక్షా విధానం, సిలబస్ పై అవగాహన తెచ్చుకొని ప్రిపేర్ అయితే.. విజయం సాధించవచ్చు. ఈ పరీక్షలను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) నిర్వహిస్తోంది. ఇక పరీక్షా విధానానికి వస్తే.. జనరల్ నాలెడ్జ్ & జనరల్ అవేర్నెస్ 20 ప్రశ్నలకు 40 మార్కులు, ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ 20 ప్రశ్నలకు 40 మార్కులు, జనరల్ ఇంటెలిజెన్స్ & రీజనింగ్ 20 ప్రశ్నలకు 40 మార్కులు, ఇంగ్లీష్ 20 ప్రశ్నలకు 40 మార్కులు ఉంటాయి. పరీక్ష మొత్తం 80 ప్రశ్నలకు గానూ 160 మార్కులు ఉంటుంది. ఒక్కో ప్రశ్నకు 2 మార్కులు ఉంటాయి. ప్రతి తప్పు సమాధానానికి 0.50 మార్కుల నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. పరీక్షకు గంట సమయం ఇస్తారు. పరీక్షలు ఇంగ్లీష్ మరియు హిందీ భాషలలో నిర్వహిస్తారు.
క్రింది లింక్ పై క్లిక్ చేసి సిలబస్ PDF డౌన్లోడ్ చేసుకోగలరు