CISF: అగ్నిమాపక శాఖలో కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ | 451 పోస్టులు | అర్హత, వయస్సు, దరఖాస్తు, విధానం ఎంపిక విధానం..
కానిస్టేబుల్ ఉద్యోగాలకి మరో కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ CISF నుంచి కానిస్టేబుల్ డ్రైవర్ పోస్టులు అలాగే ఫైర్ సర్వీసెస్ విభాగంలో కానిస్టేబుల్ డ్రైవర్-కం-పంప్ ఆపరేటర్ పోస్టులని భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేశారు. మొత్తం 451 పోస్టులను భర్తీ చేస్తున్నారు. కేవలం పురుష అభ్యర్థులు మాత్రమే ఈ ఉద్యోగాలకు దరఖాస్తుకు అర్హులు. పదవ తరగతి విద్యార్హతతో పాటు డ్రైవింగ్ లైసెన్స్ కలిగిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాల వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
పోస్టుల వివరాలు:
కానిస్టేబుల్ డ్రైవర్ పోస్టులు: 183
ఫైర్ సర్వీసెస్ విభాగంలో కానిస్టేబుల్ డ్రైవర్-కం-పంప్ ఆపరేటర్ పోస్టులు: 268
మొత్తం 451 పోస్టులు.
దరఖాస్తు విధానం:
2023 జనవరి 23వ తేదీ నుంచి 2023 ఫిబ్రవరి 22వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలి.
www.cisfrectt.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
విద్యార్హతలు:
పదవ తరగతి విద్యార్హతతో పాటు హెవీ మోటార్ వెహికల్, లైట్ మోటార్ వెహికల్, మోటార్ సైకిల్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి.
డ్రైవింగ్ విభాగంలో మూడు సంవత్సరాల అనుభవం ఉండాలి.
వయోపరిమితి:
21 నుంచి 27 సంవత్సరాల లోపు వారు దరఖాస్తు చేసుకోవచ్చు.
జీతం:
రూ.21,700/- నుంచి 69,100/- వరకు
ఎంపిక విధానం:
ఫిజికల్ స్టాండర్డ్ టెస్టులు, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్టులు, ధ్రువపత్రాల పరిశీలన, ట్రేడ్ టెస్ట్, రాత పరీక్ష మరియు మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
ఫిజికల్ టెస్ట్ వివరాలు
క్రింది లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోగలరు