APSRTC: ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థలో రాతపరీక్ష లేకుండా ఖాళీలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల
APSRTC: ఆంధ్రప్రదేశ్ ఆ రోడ్డు రవాణా సంస్థలో ఖాళీలు భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 277 అప్రెంటిస్ ఖాళీలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. మొత్తం ఆరు జిల్లాల్లో ఖాళీలు భర్తీ చేస్తున్నారు. కర్నూలు జిల్లా, నంద్యాల జిల్లా, అనంతపురం జిల్లా, శ్రీ సత్యసాయి జిల్లా, కడప జిల్లా, అన్నమయ్య జిల్లాలకు చెందిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. సంబంధిత ట్రేడులో ఐటిఐ అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. www.apprenticeshipindia.gov.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ముందుగా వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.. తర్వాత లాగిన్ అయ్యి సంబంధిత జిల్లా పోర్టల్ లోకి వెళ్లి దరఖాస్తు ఫారం నింపాలి.

