December 19, 2024
AP Govt Jobs

APPSC Group 2: భారతీయ సమాజం బిట్ బ్యాంక్

భారతీయ సమాజం

వివిధ భిన్న స్వరూపాలు కలిసి భారతీయ సమాజంలో ఉండటం వల్లే భారతీయ సమాజం సాంస్కృతిక భిన్నత్వాన్ని ప్రదర్శిస్తుంది. భిన్నత్వస్వరూపాలను ఐదు రకాలుగా చెప్పుకోవచ్చు. అవి..
1.మత భిన్నత్వం
2.జాతి భిన్నత్వం
3.భాషా భిన్నత్వం
4.కుల భిన్నత్వం
5.భౌగోళిక భిన్నత్వం

               మత భిన్నత్వం 

భారతీయ సమాజంలో వివిధ మతాలకు చెందిన వ్యక్తులు ఉన్నప్పటికీ ప్రధానంగా 6 మతాలు కనిపిస్తాయి. అవి హిందూ, ఇస్లాం, క్రైస్తవ, సిక్కు, బౌద్ధ, జైన మతాలు. భారతీయ సమాజంలో ఈ మతాల ప్రయాణం ఒకదానికొకటి సమాంతరంగా ఉంటుంది. ఈ క్రమంలో ఒకదానినొకటి ప్రభావితం చేస్తున్నప్పటికీ దేని ఉనికిని అది కాపాడుకుంటూ వస్తున్నాయి. ఈవిధంగా భారతీయ సమాజంలో సాంస్కృతిక భిన్నత్వం కనిపిస్తుంది.

               జాతి భిన్నత్వం 

భారతీయ సమాజంలో జాతులను హెర్బర్ట్ రిస్లే, ఏసీ హెడెన్, బీఎస్ గుహ తదితరులు అధ్యయనం చేశారు. బీఎస్ గుహ భారతీయ సమాజంలో వ్యక్తులను 6 జాతులుగా విభజించారు.
1.నీగ్రిటోలు: కేరళలో కదర్, ఇరుల, తమిళనాడులో పునియన్లు
2.ప్రొటోఆస్ట్రలాయిడ్లు: ఓరాన్లు, సంతాలులు , భిల్ లు , ముండాలు , హోలు
3.మంగోలాయిడ్ లు: దఫ్లాలు, టిబెట్ లోని జాతులు
4.మెడిటేరినియన్ లు: సింధు నాగరకత ప్రజలు
5.పశ్చిమ బ్రాకీసెఫాల్స్: బనియన్లు (గుజరాత్), బెంగాల్లో కాయస్తలు.
6.నార్డిక్ లు: పంజాబ్, రాజస్థాన్లలో ఉంటారు.

             భాషా భిన్నత్వం 

భారత రాజ్యాంగం గుర్తించిన భాషలు 22. ఇవి కాకుండా వేల భాషలు, మాండలికాలు భారతీయ సమాజంలో కనిపిస్తాయి. భారతదేశంలో భాషలను 5 భాషా కుటుంబాలుగా విభజించారు. అవి ..
1.ఇండో ఆర్యన్: సంస్కృతం, హిందీ, పంజాబీ, ఒరియా, మరాఠీ, గుజరాతీ
2.ద్రవిడియన్: తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం, తులు, గోండి
3.ఆస్ట్రిక్: సంతాలీ, హో, గదబ, సవర
4.నీగ్రిటో: అండమానీస్ భాష
5.సినోటిబెటన్: బోడో భాష, లిపిలేని ఇతర భాషలు (టిబెట్ పరిసర ప్రాంతాల్లో)

             కుల భిన్నత్వం 

భారతీయ సమాజం కులాల సమాజం. మన సమాజంలో కులపరమైన సంక్లిష్టత మరే దేశంలోనూ, సమాజంలోనూ కనిపించదు. భారతీయ సమాజంలో కులం ఆవిర్భావానికి వివిధ సిద్ధాంతాలున్నాయి. అవి దైవ సిద్ధాంతం, జాతి సిద్ధాంతం, వృత్తి సిద్ధాంతం, పరిణామ సిద్ధాంతం, సాంస్కృతిక సిద్ధాంతం లాంటివి. ప్రాచీన భారతీయ సమాజంలో వర్ణవ్యవస్థ ఉండేది. ఇందులో అనులోమ, ప్రతిలోమ వివాహాలు జరగడం వల్ల కొత్తజాతులు పుట్టుకొచ్చాయి. జాతుల మధ్య సంకరణం జరగడం వల్ల కులాలు.. కులాల నుంచి ఉప కులాలు పుట్టుకురావడం వల్ల కులవ్యవస్థ సంక్లిష్టంగా మారిందన్నది ఒక వాదన.

      భారతీయ సమాజం - ప్రాక్టీస్ క్వశ్చన్స్

1.సింధూ నాగరికత ప్రజలు ఏ జాతిని పోలి ఉంటారు?
Ans:మెడిటేరినియన్

2.కేరళలో కదర్, ఇరుల తెగలు, తమిళనాడులో పునియన్లు ఏ జాతిని పోలి ఉంటారు?
Ans:నీగ్రిటోలు

3.నార్డిక్ జాతిని పోలిన ప్రజలు ఏ రాష్ట్రంలో ఉంటారు?
Ans:పంజాబ్, రాజస్థాన్

4.బెంగాల్ లోని కాయస్థలు ఏ జాతిని పోలి ఉంటారు?
Ans:పశ్చిమ బ్రాకీసెఫాల్స్

5.బోడో ఏ భాష కుటుంబానికి చెందింది?
Ans:సినోటిబెటన్

6.బీఎస్ గుహ భారతీయ సమాజంలో వ్యక్తులను ఎన్ని జాతులుగా విభజించారు?
Ans:6 జాతులు

7.భారత రాజ్యాంగం గుర్తించిన భాషలు ఎన్ని?
Ans:22 భాషలు

8.తెలుగు భాష ఏ కుటుంబానికి చెందింది?
Ans:ద్రవిడియన్

9.హిందీ భాష ఏ కుటుంబానికి చెందింది?
Ans:ఇండో ఆర్యన్

10.భారతీయ సమాజంలో ప్రధానంగా ఎన్ని మతాలు కనిపిస్తాయి?
Ans:6 మతాలు (హిందూ, ఇస్లాం, క్రైస్తవ, సిక్కు, బౌద్ధ, జైన మతాలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!