APPSC: గ్రూప్-2 అభ్యర్థులకు గుడ్ న్యూస్.. గ్రూప్-1 నోటిఫికేషన్ అప్డేట్ వచ్చింది
నిరుద్యోగులకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) శుభవార్త తెలిపింది. గ్రూప్-2 పోస్టుల సంఖ్య పెరగనున్నట్లు పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ గౌతమ్ సవాంగ్ తెలిపారు. విజయవాడలోని ఏపీపీఎస్సీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇప్పటికే ప్రకటించిన 508 గ్రూప్-2 పోస్టుల కంటే అదనంగా మరికొన్ని ఖాళీల వివరాలు ప్రభుత్వం నుంచి రాబోతున్నాయి అని తెలిపారు.
ప్రస్తుతం గ్రూప్-1 ప్రిలిమ్స్ రెండు పేపర్లు ఉన్నాయని, దాన్ని ఒక పేపర్ చేసే అవకాశాన్ని పరిశీలిస్తున్నట్లు గౌతం సవాంగ్ తెలిపారు. మెయిన్స్ లో కూడా ఇప్పుడు ఉన్న ఐదు పేపర్లను నాలుగు పేపర్లకు తగ్గించి, అందులో రెండు పేపర్లు వ్యాసరూప ప్రశ్నలు (డిస్క్రిప్టివ్), రెండు పేపర్లు ఆబ్జెక్టివ్ ప్రశ్నలతో రూపొందించాలనే దిశగా కసరత్తు చేస్తున్నట్లు తెలిపారు. అయితే సిలబస్ మారదని, ఉన్నదాన్నే కొంత రీఫ్రేమ్ చేసే అవకాశం ఉందని చెప్పారు. సిలబస్ గురించి అభ్యర్థులకు ఎలాంటి అపోహలు, ఆందోళన అవసరం లేదన్నారు. అభ్యర్థులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా, వారిలో వాస్తవ సామర్థ్యాన్ని వెలికితీసేలా కొత్త విధానం ఉంటుందన్నారు. గ్రూప్-1 నోటిఫికేషన్ నెల రోజుల తర్వాత విడుదలయ్యే అవకాశం ఉందన్నారు. మొత్తం 89 గ్రూప్-1 ఉద్యోగాల భర్తీకి ఇప్పటికే ఆర్థిక శాఖ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే.
అతి తక్కువ ధరలో గ్రూప్-2 ఆన్లైన్ కోచింగ్ కోసం క్రింది యాప్ లింక్ పై క్లిక్ చేయండి
క్రింది లింక్ పై క్లిక్ చేసి గ్రూప్-2 సిలబస్ డౌన్లోడ్ చేసుకోండి
ప్రతిరోజు లేటెస్ట్ జాబ్ అప్డేట్స్, కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ గ్రూపులో జాయిన్ అవ్వండి