APPSC Group-2: త్వరలో గ్రూప్-2 నోటిఫికేషన్ విడుదల: ఏపీపీఎస్సీ బోర్డు చైర్మన్ గౌతమ్ సవాంగ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో త్వరలో గ్రూప్-2 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు ఏపీపీఎస్సీ బోర్డు చైర్మన్ గౌతమ్ సవాంగ్ వెల్లడించారు. విజయవాడలో మే 31వ తారీఖున నిర్వహించిన మీడియా సమావేశంలో పై విషయాలు తెలిపారు. ఇటీవలనే ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి 900 పైగా గ్రూప్-2 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే.
ఖాళీల వివరాలు అందగానే నోటిఫికేషన్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి గ్రూప్-2 (900) ఖాళీల వివరాలు అందగానే నోటిఫికేషన్ జారీ చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ఏపీపీఎస్సీ బోర్డు చైర్మన్ గౌతమ్ సవాంగ్ తెలిపారు. ఇవే కాకుండా ఇప్పటికే సిద్ధంగా ఉన్న 1,967 పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ నుంచి నోటిఫికేషన్లు జారీ చేస్తామని తెలిపారు. కోర్టులో కేసులు ఉన్నందున అధ్యాపకులు, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి సమయం పడుతుందని వెల్లడించారు. ఏపీపీఎస్సీ ద్వారా జరిగే నియామకాల పరీక్షల్లో జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ ప్రశ్నలను ఆంగ్లంలోనే కాకుండా తెలుగులోనూ ఇస్తాం అని బోర్డు చైర్మన్ గౌతమ్ సవాంగ్ వివరించారు.
ఏపీపీఎస్సీ గ్రూప్ 2 సిలబస్ కొరకు క్రింది లింక్ పై క్లిక్ చేయండి.
ప్రతిరోజు లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ గ్రూపులో జాయిన్ అవ్వండి
APPSC గ్రూప్-2 ఉద్యోగాలకు సంబంధించిన పూర్తీ కోర్సుని ‘Telugu Vidyarthi’ యాప్ ద్వారా పేద విద్యార్థుల కోసం అతి తక్కువ ధరకే అందించడం జరుగుతోంది. క్రింది లింక్ పై క్లిక్ చేసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి.