APPSC: గ్రూప్-2 అభ్యర్థులకు గుడ్ న్యూస్.. 1:100 నిష్పత్తిలో ఫలితాలు విడుదలకు నిర్ణయం
APPSC Group-2: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రూప్-2 అభ్యర్థులకు అతిపెద్ద శుభవార్త వచ్చింది. 1:100 నిష్పత్తిలో అభ్యర్థులను మెయిన్స్ పరీక్షకు ఎంపిక చేయనున్నట్లు సమాచారం.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రూప్-2 ప్రిలిమ్స్ పరీక్ష రాసిన అభ్యర్థులకు అతిపెద్ద శుభవార్త వచ్చింది. ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్ పరీక్షకు 1:100 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేయడానికి ఏపీపీఎస్సీ అధికారులు నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. రాబోయే వారం రోజుల లోపు 1:100 నిష్పత్తికి సంబంధించిన నిర్ణయాన్ని ఏపీపీఎస్సీ అధికారికంగా తెలియజేయునున్నది. ఈ విషయాన్ని ఏపీపీఎస్సీ బోర్డు మెంబర్ అయిన పరిగే సుధీర్ గారు ట్విట్టర్ ద్వారా తెలియజేశారు.
గ్రూప్-2 మెయిన్స్ పరీక్షకు 1:100 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేయాలని.. గ్రూప్ 2 పరీక్ష రాసిన అభ్యర్థులతో పాటు, నిరుద్యోగ సంఘాల నాయకులు, విద్యార్థి సంఘాల నాయకులు ఏపీపీఎస్సీ అధికారులకు వినతి పత్రాలు సమర్పించిన విషయం తెలిసిందే. అభ్యర్థుల అభ్యర్థన మేరకు 1:100 నిష్పత్తిలో ఎంపిక చేయడానికి ఏపీపీఎస్సీ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. దీనికి సంబంధించిన నిర్ణయాన్ని అధికారికంగా వారం రోజులలో ఏపీపీఎస్సీ వెల్లడించనుంది. ఈ కారణంగా కటాఫ్ మార్కులు కూడా చాలా వరకు తగ్గే అవకాశం ఉంది.
ప్రతిరోజు లేటెస్ట్ జాబ్ అప్డేట్స్, కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ కోసం వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూపులో జాయిన్ అవ్వండి
RPF SI/Constable ఆన్లైన్ కోచింగ్ + టెస్ట్ సిరీస్ కేవలం “499 రూపాయలకే” అందించడం జరుగుతోంది. 738 వీడియోలు, 65 టెస్టులు, 156 PDFలు ఉంటాయి. Full Course + Test Series కోసం క్రింది యాప్ లింక్ పై క్లిక్ చేయండి.