December 19, 2024
AP Govt Jobs

AP అటవీ శాఖలో 689 ఉద్యోగాల భర్తీ | APPSC Forest Beat Officer Recruitment 2024

AP Government Jobs: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. అటవీ శాఖలో 689 ఉద్యోగాలు భర్తీకి రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలుపుతూ ఉత్తర్వులు జారీ చేసింది.

✅ నిరుద్యోగుల కోసం “AP ఫారెస్ట్ బీట్ ఆఫీసర్” Full Course కేవలం “499 రూపాయలకే” అందించడం జరుగుతోంది. 1125 వీడియోలు, 199 PDF Files ఉంటాయి. Full Course కోసం క్రింది యాప్ లింకుపై క్లిక్ చేయండి.

Download Our App

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. అటవీ శాఖలో 689 ఉద్యోగాలు భర్తీకి రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలుపుతూ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన ఈరోజు(జనవరి 31) మంత్రి వర్గ సమావేశం జరిగింది. ఈ మేరకు పలు కీలక నిర్ణయాలకు మంత్రి మండలి సమావేశంలో పచ్చజెండా ఊపారు. అటవీ శాఖలో 689 ఉద్యోగాల భర్తీకి మంత్రిమండలి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

అటవీ శాఖలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలకు ఇంటర్మీడియట్ విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవటానికి అవకాశం కల్పిస్తారు. ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఉద్యోగాలకు డిగ్రీ విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తారు. ఈ ఉద్యోగాల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) ద్వారా నోటిఫికేషన్లు విడుదల కానున్నాయి.

Download Our App

Whatsapp Group Link

Telegram Group Link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!