APPSC: ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, సెక్షన్ ఆఫీసర్, రేంజ్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీ.. మొత్తం 1,000 పోస్టులు
AP Government Jobs: ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖలో 1,000 ఉద్యోగాలు భర్తీకి మూడు కొత్త నోటిఫికేషన్లు విడుదల కానున్నాయి. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు.
✅నిరుద్యోగుల కోసం AP గ్రూప్-2, గ్రామ సచివాలయం టెస్ట్ సిరీస్ కేవలం “99 రూపాయలకే” అందించడం జరుగుతోంది. 600 పైగా టెస్టులు, PDFలు ఉంటాయి. టెస్ట్ సిరీస్ కోసం క్రింది యాప్ లింక్ పై క్లిక్ చేయండి.
ఆంధ్రప్రదేశ్ అటవీశాఖలో ఖాళీగా ఉన్న 1,000 పోస్టుల భర్తీకి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ (PCCF) వై.మధుసూదనరెడ్డి మంగళవారం వెల్లడించారు. హార్సిలీ హిల్స్ పై జరుగుతున్న అటవీశాఖ అభివృద్ధి పనులను ఆయన పరిశీలించారు. మధుసూదనరెడ్డి మాట్లాడుతూ అటవీశాఖలో 750 ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, 200 ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్, 50 ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని, ప్రభుత్వం నుంచి అనుమతులు వచ్చాక నోటిఫికేషన్లు జారీ చేస్తామన్నారు.
ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలకు ఇంటర్మీడియట్ విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవటానికి ఆ అవకాశం కల్పిస్తారు. ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఉద్యోగాలకు డిగ్రీ విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తారు. ఈ ఉద్యోగాల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) ద్వారా నోటిఫికేషన్లు విడుదల కానున్నాయి.
✅నిరుద్యోగుల కోసం AP గ్రూప్-2, గ్రామ సచివాలయం టెస్ట్ సిరీస్ కేవలం “99 రూపాయలకే” అందించడం జరుగుతోంది. 600 పైగా టెస్టులు, PDFలు ఉంటాయి. టెస్ట్ సిరీస్ కోసం క్రింది యాప్ లింక్ పై క్లిక్ చేయండి.
✅ప్రతిరోజు లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ గ్రూపులో జాయిన్ అవ్వండి