AP Government Jobs: ఆంధ్రప్రదేశ్ కో-ఆపరేటివ్ బ్యాంకులో స్టాఫ్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీ.. 26 జిల్లాల వారికి అవకాశం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీ కోసం మరో కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ నుంచి స్టాఫ్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 26 జిల్లాలకు చెందిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఏదైనా డిగ్రీ విద్యార్హత కలిగి తెలుగు భాష ఖచ్చితంగా వచ్చి ఉండాలి. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అర్హత, వయస్సు, జీతం, దరఖాస్తు, ఎంపిక విధానం వివరాలు తెలుసుకుందాం…
పోస్టుల వివరాలు:
స్టాఫ్ అసిస్టెంట్: 35 పోస్టులు
విద్యార్హతలు:
ఏదైనా డిగ్రీ అర్హతతో పాటు తెలుగు / ఆంగ్ల భాషలు తెలిసి ఉండాలి. కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యం ఉంటుంది.
వయోపరిమితి:
2023 అక్టోబర్ 1వ తారీకు నాటికి నాటికి 20 నుంచి 28 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
జీతభత్యాలు:
నెలకు రూ.37,252/- వరకు జీతం ఉంటుంది.
ఎంపిక విధానం:
ఆన్లైన్ టెస్ట్/ ఎగ్జామినేషన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామ్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు ఫీజు:
General/ BC అభ్యర్థులకు రూ.700/-
SC/ST అభ్యర్థులకు రూ.500/-
దరఖాస్తు విధానం:
ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం:
2023 అక్టోబర్ 7వ తారీకు నుంచి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తుకు చివరి తేదీ:
2023 అక్టోబర్ 21వ తారీకు లోపు దరఖాస్తు చేసుకోవాలి.
క్రింది లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి
అతి తక్కువ ధరలో గ్రూప్-2 ఆన్లైన్ కోచింగ్ కోసం క్రింది యాప్ లింక్ పై క్లిక్ చేయండి
APP Link
ప్రతిరోజు లేటెస్ట్ జాబ్ అప్డేట్స్, కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ గ్రూపులో జాయిన్ అవ్వండి
Telegram Group Link