TSPSC Group-4 | గ్రూప్-4 మాస్టర్ క్వశ్చన్ పేపర్, తుది ‘కీ’ విడుదల.. ఫలితాలు ఎప్పుడంటే?
TSPSC Group-4 Final key | తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-4 ఫైనల్ ‘కీ’ విడుదలైంది. అభ్యర్థులు క్రింది లింక్ పై క్లిక్ చేసి గ్రూప్-4 మాస్టర్ క్వశ్చన్ పేపర్, ఫైనల్ ‘కీ’ డౌన్లోడ్ చేసుకోవచ్చు.
తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-4 ఫైనల్ ‘కీ’ విడుదలైంది. అభ్యర్థులు క్రింది లింక్ పై క్లిక్ చేసి ఫైనల్ ‘కీ’ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ ‘కీ’ని తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) శుక్రవారం వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. ఆగస్టు 28న గ్రూప్-4 పరీక్ష ప్రాథమిక ‘కీ’ విడుదల చేసిన అధికారులు.. ఆగస్టు 30 నుంచి సెప్టెంబర్ 4వ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా అభ్యంతరాలను స్వీకరించిన విషయం తెలిసిందే. అభ్యర్థుల నుంచి వచ్చిన అభ్యంతరాలను నిపుణుల కమిటీతో వెరిఫై చేయించి తాజాగా గ్రూప్-4 ఫైనల్ ‘కీ’ విడుదల చేశారు. పేపర్-1లో ఏడు ప్రశ్నలు తొలగించిన అధికారులు.. 8 ప్రశ్నలకు ఆప్షన్ మార్చారు. అలాగే, పేపర్-2లో రెండు ప్రశ్నలు తొలగించి.. ఐదు ప్రశ్నలకు ఆప్షన్ మార్చారు. తెలంగాణలో గ్రూప్-4 సర్వీసుల్లో 8,180 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ ఉద్యోగాలకు సంబంధించిన రాత పరీక్షలను (పేపర్-1, పేపర్-2) జులై 1న నిర్వహించారు. వారం రోజుల లోపు గ్రూప్-4 జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ విడుదల చేసి, ఆ తర్వాత సెలక్షన్ లిస్టును ప్రకటించనున్నట్లు సమాచారం.
క్రింది లింక్ పై క్లిక్ చేసి గ్రూప్-4 మాస్టర్ క్వశ్చన్ పేపర్, ఫైనల్ ‘కీ’ డౌన్లోడ్ చేసుకోగలరు
ప్రతిరోజు లేటెస్ట్ జాబ్ అప్డేట్స్, కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ గ్రూపులో జాయిన్ అవ్వండి