AP Watchmen Jobs: ఆంధ్రప్రదేశ్ లో 5,388 వాచ్ మెన్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 5,388 ప్రభుత్వ స్కూళ్లలో నైట్ వాచ్ మెన్ల నియామకానికి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మొత్తం 5,388 నైట్ వాచ్మెన్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. 2023 మే 1వ తేదీ నాటికి ఈ ఖాళీలను భర్తీ చేయనున్నారు. రాష్ట్రంలో నాడు – నేడు కింద వేలాదికోట్ల రూపాయలతో ప్రభుత్వ పాఠశాలలను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తున్న ప్రభుత్వం పాఠశాలల భద్రత, అక్కడి పరికరాలు, ఇతర సదుపాయాల పరిరక్షణ, అలాగే పాఠశాలల ఆవరణలోకి సంఘ విద్రోహశక్తులు ప్రవేశించకుండా నిరోధించడానికి ప్రభుత్వం నైట్ వాచ్మెన్ నియామకానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వీరి నియామకానికి అనుసరించాల్సిన విధివిధానాలపై పాఠశాల విద్యాశాఖ ఏప్రిల్ 18న మార్గదర్శకాలను జారీ చేసింది. వాచ్మెన్లుగా నియమితులైన వారికి నెలకు 6,000 రూపాయలు చొప్పున గౌరవ వేతనం ఇవ్వనున్నారు.
మొత్తం స్కూళ్లలో ప్రస్తుతం గుర్తించిన 5,388 నాన్ రెసిడెన్షియల్ ఉన్నత పాఠశాలలో ఒక్కొక్క వాచ్మెన్ ను నియమించనున్నారు. ఈ మేరకు అన్ని జిల్లాల విద్యాధికారులు చర్యలు తీసుకోవాలని మధ్యాహ్నం పథకం స్కూల్ శానిటేషన్ డైరెక్టర్ డాక్టర్ నిధి మీనా మెమో విడుదల చేశారు.
వాచ్మెన్లను ఎంపిక చేయడానికి మార్గదర్శకాలు
👉ఇప్పటికే నియమితులైన ఆయా/కుక్ కమ్ హెల్పర్ భర్తకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి.
👉గ్రామం/వార్డులో మాజీ సైనికులకు రెండో ప్రాధాన్యత ఇవ్వాలి.
👉వీరెవరూ అందుబాటులో లేకపోతే ఇతర వ్యక్తిని నియమించవచ్చు.
👉నైట్ వాచ్మన్ గ్రామీణ ప్రాంతాల్లో స్థానిక ఉండాలి.
👉ఆ వార్డులో అందుబాటులో లేకుంటే, సంబంధిత పట్టణ ప్రాంతాల నివాసిని ఎంపి కచేయాలి.
👉వయసు 60 ఏళ్లలోపు ఉండాలి.
👉ఇప్పుడు గుర్తించిన 5,388 పాఠశాలలు కాకుండా ఇతర పాఠశాలల్లో నియమించ కూడదు.
👉ఎంపికైన వారికి గౌరవ వేతనంగా నెలకు రూ.6 వేల చొప్పున టాయిలెట్ మెయింటెనెన్స్ ఫండ్ నుంచి చెల్లించాలి.
నైట్ వాచ్మెన్ విధులు
👉పాఠశాల మూసివేయడానికి ముందు సాయంత్రం పాఠశాలకు హాజరు కావాలి.
👉పని దినాల్లో మరుసటిరోజు పాఠశాల తెరిచే వరకు విధుల్లో ఉండాలి. ఇతర రోజుల్లో కూడా విధుల్లో ఉండాలి. సంబంధిత ప్రధా నోపాధ్యాయుని పర్యవేక్షణలో పనిచేయాలి.
👉రాత్రి కాపలాదారు విధుల్లో ప్రధానమైనది పాఠశాల ఆస్తి అయిన భవనం/ప్రాంగణం, ఇతర వస్తువులు, పరికరాలకు రక్షకుడిగా పని చేయాలి.
👉పాఠశాల ప్రాంగణంలోకి అనధికార వ్యక్తులు ఎవరూ ప్రవేశించకుండా చూడాలి.
👉ఏవైనా అసాధారణ కార్యకలాపాలు జరిగిన ప్పుడు, అగ్నిప్రమాదం వంటివి ఏర్పడినప్పుడు, ఏదైనా అనుమానం వచ్చినప్పుడు సంబంధిత హెడ్ మాస్టర్ కు, సమీప పోలీస్ స్టేషన్ కు, అగ్నిమాపక విభాగానికి నివేదించాలి.
👉సాయంత్రం పాఠశాల గార్డెన్ కు నీరు పోయాలి. ఎప్పటికప్పుడు ఆర్వో ప్లాంట్ను శుభ్రం చేయాలి.
👉పాఠశాలకు సంబంధించిన మెటీరియల్ ను తీసుకురావడం, వాటిని హెచ్ఎంకు అందించడం చేయాలి.
👉స్కూలుకు సంబంధించి హెచ్ఎం చెప్పే ఇతర పనులను చేయాలి.
👉నైట్ వాచ్మన్ పనిని హెడ్మాస్టర్, పేరెంట్స్ కమిటీ ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలి.
👉2023 మే 1వ తేదీనుంచి పాఠశాలల్లో వాచ్ మన్లను నియమించేలా చర్యలు తీసుకోవాలి.
👉నైట్ వాచ్మెన్ రిజిస్ట్రేషన్ సంబంధిత హెడ్ మాస్టర్ ఐఎంఎంఎస్ యాప్ ద్వారా చేపట్టాలి.
👉వాచ్ మెన్లను నియమించిన అనంతరం ఆ వివరాలను యాప్ లో అప్లోడ్ చేయాలి.