35వేల జీతంతో ఆంధ్రప్రదేశ్ ట్రిపుల్ ఐటీల్లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. పరీక్ష లేదు, ఫీజు లేదు | AP RGUKT IIIT Recruitment 2024
AP RGUKT IIIT Jobs: ఆంధ్రప్రదేశ్ ట్రిపుల్ ఐటీల్లో కాంట్రాక్ట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. పరీక్ష లేదు, ఫీజు లేదు.. ఇంటర్వ్యూ ద్వారా భర్తీ. ఆంధ్రప్రదేశ్ 26 జిల్లాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
✅నిరుద్యోగులకు సంక్రాంతి ఆఫర్: AP గ్రూప్-2 Full Course + Test Series కేవలం “399 రూపాయలకే” అందించడం జరుగుతోంది. 1022 వీడియోలు, 111 టెస్టులు, 106 PDFలు ఉంటాయి. Full Course + Test Series కోసం క్రింది యాప్ లింక్ పై క్లిక్ చేయండి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్(RGUKT) పరిధిలోని ట్రిపుల్ ఐటీ క్యాంపస్ లలో కాంట్రాక్టు ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. వివిధ విభాగాల్లో లెక్చరర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 26 జిల్లాలకు చెందిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. నూజివీడు (ఏలూరు జిల్లా), ఆర్కే వ్యాలీ (కడప జిల్లా), ఎచ్చెర్ల (శ్రీకాకుళం జిల్లా), ఒంగోలు (ప్రకాశం జిల్లా) క్యాంపస్ లలో ఖాళీలను భర్తీ చేస్తున్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
పోస్టుల వివరాలు:
1.లెక్చరర్: 61 పోస్టులు
2.అసిస్టెంట్ ప్రొఫెసర్: 133 పోస్టులు
మొత్తం పోస్టుల సంఖ్య: 194.
సబ్జెక్టుల వారిగా లెక్చరర్ పోస్టులు:
బయాలజీ: 05, కెమిస్ట్రీ: 17, ఇంగ్లిష్: 04, మ్యాథమెటిక్స్: 06, ఫిజిక్స్: 25, తెలుగు: 04.
సబ్జెక్టుల వారీగా అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు:
బయాలజీ: 02, సివిల్ ఇంజినీరింగ్: 11, సీఎస్ఈ: 34, ఈఈఈ: 23, ఈసీఈ: 38, ఇంగ్లిష్: 06, మేనేజ్మెంట్: 08, మ్యాథమెటిక్స్: 05, మెకానికల్: 05, ఎంఎంఈ: 01.
విద్యార్హతలు:
లెక్చరర్: కనీసం 50% మార్కులతో సంబంధిత సబ్జెక్టు లేదా భాషలో ఎంఏ/ ఎంఎస్సీ/ ఎంకామ్ ఉత్తీర్ణత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
అసిస్టెంట్ ప్రొఫెసర్: సంబంధిత విభాగంలో ఎంఈ/ ఎంటెక్, నెట్/ సెట్ లేదా Phd ఉత్తీర్ణత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
జీతభత్యాలు:
లెక్చరర్: రూ.35,000/-
అసిస్టెంట్ ప్రొఫెసర్: రూ.33,000/-
ఎంపిక విధానం:
ఇంటర్వ్యూ, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం:
ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తుకు చివరి తేదీ:
2024 జనవరి 22వ తారీకు లోపు దరఖాస్తు చేసుకోవాలి.
Note: ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసే అభ్యర్థులు తప్పనిసరిగా పూర్తి నోటిఫికేషన్ చదివి అర్హత ఉంటే దరఖాస్తు చేసుకోండి.
క్రింది లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి
✅నిరుద్యోగులకు సంక్రాంతి ఆఫర్: AP గ్రూప్-2 Full Course + Test Series కేవలం “399 రూపాయలకే” అందించడం జరుగుతోంది. 1022 వీడియోలు, 111 టెస్టులు, 106 PDFలు ఉంటాయి. Full Course + Test Series కోసం క్రింది యాప్ లింక్ పై క్లిక్ చేయండి.
✅ప్రతిరోజు లేటెస్ట్ జాబ్ అప్డేట్స్, కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ కోసం క్రింది వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూపులో జాయిన్ అవ్వండి