AP Govt Jobs: ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ శాఖలో రాత పరీక్ష లేకుండా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీకి మరో కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా కలెక్టర్ వారి కార్యాలయం, విశాఖపట్నం జిల్లా రెవెన్యూ శాఖ మరియు ఎన్నికల విభాగంలో ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు. ఏదైనా డిగ్రీ విద్యార్హత కలిగి ఉండి కంప్యూటర్ పరిజ్ఞానం కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆసక్తి గల అభ్యర్థులు offline ద్వారా తమ దరఖాస్తులను సమర్పించాలి.
పోస్టుల వివరాలు:
డేటా ఎంట్రీ ఆపరేటర్- 10
దరఖాస్తు విధానం:
2023 జనవరి 19వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు దరఖాస్తు చేసుకోవాలి.
విద్యార్హతలు:
డేటా ఎంట్రీ ఆపరేటర్- ఏదైనా డిగ్రీ అర్హతతో కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి ఉండాలి. Computer MS Office నందు డిప్లమా లేదా పీ.జీ. డిప్లమా ఉత్తీర్ణులై ఉండాలి. సంబంధిత రంగంలో పని అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఇస్తారు.
వయోపరిమితి:
18 నుంచి 42 సంవత్సరాల లోపు ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. ( ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వేషన్ కేటగిరీ అభ్యర్థులకు వయోపరిమితి సడలింపు ఉంటుంది).
జీతం:
డేటా ఎంట్రీ ఆపరేటర్- 18,500/-
ఎంపిక విధానం:
ఇంటర్వ్యూ మరియు ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
క్రింది లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ & అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకోగలరు.
Notification & Application form