AP Government Jobs: 10th క్లాస్ అర్హతతో జైళ్ల శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
ఆంధ్రప్రదేశ్ జైళ్ల శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఎన్టీఆర్ జిల్లా, విజయవాడలోని జిల్లా జైలులో అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. మేల్ నర్సింగ్ ఆర్డర్లీ, డ్రైవర్, ఎలక్ట్రీషియన్, స్వీపర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఏడవ తరగతి, పదవ తరగతి, ఐటిఐ విద్యార్హతలు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు రెండు రోజుల్లో దరఖాస్తు గడువు ముగియనున్నది. సెప్టెంబర్ 4వ తారీకు లోపు Offline ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అర్హత, వయస్సు, జీతం, దరఖాస్తు, ఎంపిక విధానం వివరాలు తెలుసుకుందాం…
పోస్టుల వివరాలు:
1.మేల్ నర్సింగ్ ఆర్డర్లీ: 01
2.డ్రైవర్ (LMV): 01
3.ఎలక్ట్రీషియన్: 01
4.స్వీపర్ పోస్టులు: 01
మొత్తం పోస్టులు: 04
వయోపరిమితి:
2023 ఆగస్టు 1వ తారీకు నాటికి 18 నుంచి 42 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
SC/ ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు, BC అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
విద్యార్హతలు:
1.మేల్ నర్సింగ్ ఆర్డర్లీ: పదవతరగతి పాసై కంప్యూటర్ పరిజ్ఞానం, తెలుగు ఇంగ్లీష్ భాషల్లో నైపుణ్యం కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. సంబంధిత పనిలో అనుభవం కలిగిన అభ్యర్థులకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది.
2.డ్రైవర్ (LMV): పదవ తరగతి పాసై, LMV డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండి సంబంధిత పనిలో 3 సంవత్సరాలు అనుభవం కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
3.ఎలక్ట్రీషియన్: పదవ తరగతి పాసై, ఐటిఐ ఎలక్ట్రీషియన్ ట్రేడ్ (లేదా) డిప్లొమా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
4.స్వీపర్ పోస్టులు: 7వ తరగతి పాసై, తెలుగు భాషలో నైపుణ్యం కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
జీతభత్యాలు:
1.మేల్ నర్సింగ్ ఆర్డర్లీ: Rs.12,000/-
2.డ్రైవర్ పోస్టులు: Rs.15,000/-
3.ఎలక్ట్రీషియన్: Rs.15,000/-
4.స్వీపర్ పోస్టులు: Rs.12,000/-
ఎంపిక విధానం:
విద్యార్హతల్లో వచ్చిన మార్కుల మెరిట్ మరియు ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం:
Offline ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తుకు చివరి తేదీ:
2023 సెప్టెంబర్ 4వ తారీకు లోపు దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులు పంపవలసిన చిరునామా:
O/o The Superintendent,
District Jail,
Vijayawada.
క్రింది లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి
Notification & Application form
ప్రతిరోజు లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ గ్రూపులో జాయిన్ అవ్వండి
అతి తక్కువ ధరలో గ్రూప్-2, AP SI/Constable Mains ఆన్లైన్ కోచింగ్ కోసం క్రింది యాప్ లింక్ పై క్లిక్ చేయండి.