AP Police Jobs: ఎస్ఐ పోస్టుల దరఖాస్తుకు నేడే చివరిరోజు.. ఏదైనా డిగ్రీ అర్హత ఉంటే వెంటనే అప్లై చేయండి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగాలకు దరఖాస్తు గడువు నేటితో ముగియనుంది. మొత్తం 411 ఎస్సై ఉద్యోగాల భర్తీకి APSLPRB నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. వీటిలో 315 సివిల్ ఎస్సై పోస్టులు కాగా, 96 ఏపీఎస్పీ ఆర్ఎస్ఐ పోస్టులు. సివిల్ ఎస్సై పోస్టులకు పురుష & మహిళా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు, ఏపీఎస్పీ ఆర్ఎస్ఐ పోస్టులకు కేవలం పురుష అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. ఈ ఉద్యోగాలకి 2022 డిసెంబర్ 14న ఆన్లైన్లో దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా, 2023 జనవరి 18న సాయంత్రం 5 గంటలకు ప్రక్రియ ముగియనుంది. ఏదైనా డిగ్రీ విద్యార్హత కలిగినటువంటి అభ్యర్థులందరూ దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్సై సివిల్ పోస్టులను జోన్లవారీగా, ఏపీఎస్పీ ఆర్ఎస్ఐ పోస్టులను బెటాలియన్ల వారీగా భర్తీ చేస్తారు. 2022 జూలై 1 నాటికి 21 సంవత్సరాల నుంచి 27 సంవత్సరాల లోపు వారు దరఖాస్తు చేసుకోవచ్చు. BC, SC, ST & EWS అభ్యర్థులకు వయోపరిమితిలో ఐదు సంవత్సరాలు సడలింపు ఉంటుంది. ప్రిమినరీ పరీక్ష, ఫిజికల్ టెస్ట్, మెయిన్ పరీక్ష మరియు మెడికల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
పూర్తి వివరాల కొరకు క్రింది లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి