AP SI Preliminary Results: ఆంధ్రప్రదేశ్ ఎస్ఐ ప్రిలిమ్స్ ఫలితాలు ఎప్పుడు విడుదల చేస్తారంటే?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీస్ ఎస్ఐ ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఏపీ పోలీస్ నియామక మండలి ప్రిలిమినరీ రాతపరీక్షను ఫిబ్రవరి 19న నిర్వహించింది. మొత్తం 411 ఎస్సై పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన ప్రిలిమినరీ పరీక్షలను ఫిబ్రవరి 19న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పేపర్-1, మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 5:30 వరకు పేపర్-2 పరీక్షను నిర్వహించింది. మొత్తం 1,51,243 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఈ పరీక్షలకు సంబంధించిన ప్రిలిమినరీ ‘కీ’ ఫిబ్రవరి 20వ తేదీ ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నట్లు నియామక మండలి తెలిపింది. ప్రిలిమినరీ ‘కీ’ పై అభ్యంతరాలు ఉంటే SCTSI-PWT@slprb.appolice.gov.in కు ఫిబ్రవరి 23 లోగా మెయిల్ చేయాలని తెలిపింది. అలాగే ప్రిలిమినరీ పరీక్షలకు సంబంధించిన ఫలితాలను రెండు వారాల్లో విడుదల చేయనున్నట్లు పోలీసు నియామక మండలి తెలిపింది.
క్రింది PDF లింక్ పై క్లిక్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోగలరు