ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖలో ఉద్యోగాల భర్తీకి మరో కొత్త నోటిఫికేషన్..
ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ నుంచి ఉద్యోగాల భర్తీ కోసం మరో కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీస్ ప్రధాన కార్యాలయంలోని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబోరేటరీలో ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన ల్యాబ్ అసిస్టెంట్ పోస్టులకు పోలీస్ శాఖ మంగళవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. ల్యాబ్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్సెస్, ల్యాబ్ అసిస్టెంట్ కెమికల్ సైన్సెస్, ల్యాబ్ అసిస్టెంట్ బయోలాజికల్ సైన్సెస్ విభాగాల్లో ఖాళీలను భర్తీ చేస్తున్నారు. బీఎస్సీ డిగ్రీ విద్యార్హత కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
పోస్టుల వివరాలు:
1.ఫిజికల్ సైన్సెస్: 03
2.కెమికల్ సైన్సెస్: 02
3.బయోలాజికల్ సైన్సెస్: 05
మొత్తం పోస్టులు: 10
విద్యార్హతలు:
1.ఫిజికల్ సైన్సెస్: ఫిజిక్స్ ఒక సబ్జెక్టుగా కలిగి ఉండి బీఎస్సీ డిగ్రీ పూర్తయిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు
2.కెమికల్ సైన్సెస్: కెమిస్ట్రీ లేదా బయో కెమిస్ట్రీ ఒక సబ్జెక్టుగా కలిగి ఉండి బీఎస్సీ డిగ్రీ పూర్తయిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు.
3.బయోలాజికల్ సైన్సెస్: బోటనీ, జువాలజీ మరియు కెమిస్ట్రీ సబ్జెక్టులు కలిగి ఉండి బీఎస్సీ డిగ్రీ పూర్తయిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
వయోపరిమితి:
2022 జూలై 1 నాటికి 34 సంవత్సరాలు లోపు ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు.
జీతభత్యాలు:
రూ.20,000/- p.m.
ఎంపిక విధానం:
విద్యార్హతల్లో వచ్చిన మార్కులు, రాతపరీక్ష, పని అనుభవం మరియు ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం:
Offline ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
2023 ఫిబ్రవరి 23వ తారీకు లోపు దరఖాస్తు చేసుకోవాలి.
క్రింది లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ మరియు దరఖాస్తు ఫారం డౌన్లోడ్ చేసుకోగలరు.