AP Constable Recruitment | పోలీస్ కానిస్టేబుల్ నియామకాలు త్వరగా పూర్తి చేయండి: సీఎం ఆదేశాలు
AP Police Constable Recruitment | ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీస్ కానిస్టేబుల్ నియామకాలను త్వరగా పూర్తిచేయాలని ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పోలీస్ అధికారులను ఆదేశించారు.
విజయవాడలో శనివారం నిర్వహించిన పోలీసు అమరవీరుల సంస్మరణ కార్యక్రమానికి ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి సంబంధించి పలు వ్యాఖ్యలు చేశారు. “పోలీసులకు వారాంతపు సెలవులు తీసుకొచ్చే అడుగు మన ప్రభుత్వంలోనే పడింది. పోలీసుల మీద ఒత్తిడి తగ్గించేందుకు అదనంగా పోలీసులను నియమించాల్సిన అవసరం ఉందని గుర్తించాము. అందుకు అనుగుణంగా గ్రామ, వార్డు సచివాలయాల్లో 16 వేల మహిళా పోలీసులను నియమించాం. దాదాపు మరో 6,100 కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేసేందుకు చర్యలు చేపట్టాం. కొందరు కోర్టుల వరకు వెళ్లడంతో కాస్త జాప్యం జరుగుతోంది. కోర్టుల్లో త్వరగా ఒక పరిష్కారం వచ్చేలా చేసి పోలీసు ఉద్యోగాల నియామక ప్రక్రియను ఎంత త్వరగా వీలైతే అంత వేగంగా పూర్తి చేయాలని డీజీపీ, పోలీస్ ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేస్తున్నాను” అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.
అతి తక్కువ ధరలో AP గ్రూప్-2, కానిస్టేబుల్ మెయిన్స్ ఆన్లైన్ కోచింగ్ కోసం క్రింది యాప్ లింక్ పై క్లిక్ చేయండి
ప్రతిరోజు లేటెస్ట్ జాబ్ అప్డేట్స్, కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ గ్రూపులో జాయిన్ అవ్వండి