AP: కానిస్టేబుల్ ప్రిలిమినరీ ఫలితాలు ఎప్పుడు విడుదల చేస్తారంటే?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీస్ కానిస్టేబుల్ ప్రిలిమినరీ రాత పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. మొత్తం 6100 కానిస్టేబుల్ పోస్టుల కోసం 5,03,487 మందికి హాల్ టికెట్లు జారీ చేశారు. వీరిలో 4,58,219 మంది పరీక్షకు హాజరయ్యారు. ఒక్కో పోస్టుకు సగటున 75 మంది పోటీ పడుతున్నారు. రెండు వారాల్లో కానిస్టేబుల్ రాత పరీక్ష ఫలితాలను వెల్లడిస్తామని, ఫలితాలను స్కాన్ చేసిన ఓఎంఆర్ షీట్లతో కలిపి వెబ్సైట్లో అప్లోడ్ చేస్తామని APSLPRB తెలిపింది. A,B,C,D సిరీస్ ప్రశ్నపత్రాలను, వాటి ప్రిలిమినరీ ఆన్సర్ ‘కీ’ ASLPRB వెబ్సైట్లో పొందుపరిచారు. ఆన్సర్ ‘కీ’ పై అభ్యర్థులకు అభ్యంతరాలు ఉంటే ఈనెల 25వ తారీకు సాయంత్రం ఐదు గంటల లోపు సూచించిన ఫార్మాట్ లో mail-slprb@ap.gov.in కు మెయిల్ చేయాలని పేర్కొన్నారు.
క్రింది లింక్ పై క్లిక్ చేసి ఆన్సర్ ‘కీ’ మరియు ప్రశ్న పత్రాలు డౌన్లోడ్ చేసుకోగలరు