AP Constable Mains: పోలీస్ కానిస్టేబుల్ మెయిన్ పరీక్ష ఎప్పుడు నిర్వహిస్తారంటే?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీస్ కానిస్టేబుల్ తుది రాతపరీక్షను ఏప్రిల్ చివరి వారంలో నిర్వహించనున్నట్లు పోలీస్ నియామక మండలి తెలిపింది. కానిస్టేబుల్ ఈవెంట్స్ (PMT/ PET) నిర్వహణ తేదీ విడుదల చేసింది. 2023 మార్చి 13వ తారీకు నుంచి ఫిజికల్ మెజర్మెంట్స్ టెస్ట్ (PMT), ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ (PET) లను నిర్వహించనున్నారు. ఈవెంట్స్ కు సంబంధించిన కాల్ లెటర్లను అభ్యర్థులు slprb.ap.gov.in వెబ్సైట్లో 2023 మార్చి 1వ తారీకు మధ్యాహ్నం 3 గంటల నుంచి 2023 మార్చి 10వ తారీకు మధ్యాహ్నం 3 గంటల వరకు డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈవెంట్స్ లో క్వాలిఫై అయిన అభ్యర్థులు మెయిన్ పరీక్షకు అర్హత సాధిస్తారు.