APలో రాతపరీక్ష లేకుండా 10th క్లాస్, డిగ్రీ అర్హతలతో ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ | AP Outsourcing Jobs 2025
AP Outsourcing Jobs Notification
AP Outsourcing Jobs: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కృష్ణా జల్లా వైద్య ఆరోగ్య శాఖలో కాంట్రాక్ట్ & ఔట్సోర్సింగ్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల. అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన లాస్ట్ గ్రేట్ సర్వీసెస్, డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. కాంట్రాక్టు ప్రాతిపదికన ఫార్మసిస్ట్ గ్రేడ్ 2, ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. పోస్టులను అనుసరించి పదవ తరగతి డిగ్రీ అర్హతలు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. 18 నుంచి 42 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవటానికి అవకాశం ఉంటుంది. రాత పరీక్ష ఉండదు.. విద్యార్హతలో వచ్చిన మార్కుల మెరిట్, రూల్ ఆఫ్ రిజర్వేషన్, సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అర్హత కలిగిన అభ్యర్థులు డిసెంబర్ 31 వ తారీకు లోప ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, వైద్య ఆరోగ్యశాఖ కృష్ణా జిల్లా నుంచి నోటిఫికేషన్ విడుదలైంది.
పోస్టుల వివరాలు
ఈ నోటిఫికేషన్ ద్వారా కాంట్రాక్టు పద్ధతిలో ఫార్మసిస్ట్ గ్రేడ్ 2, ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 పోస్టులను భర్తీ చేస్తున్నారు. అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన డేటా ఎంట్రీ ఆపరేటర్, లాస్ట్ గ్రేడ్ సర్వీసెస్ పోస్టులను భర్తీ చేస్తున్నారు.
- ఫార్మసిస్ట్ గ్రేడ్ 2: 01 పోస్టు
- ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2: 07 పోస్టులు
- డేటా ఎంట్రీ ఆపరేటర్: 04 పోస్టులు
- లాస్ట్ గ్రేడ్ సర్వీసెస్ 10 పోస్టులు
విద్యార్హతలు
- ఫార్మసిస్ట్ గ్రేడ్ 2: ఈ ఉద్యోగాలకు డిప్లొమా ఇన్ ఫార్మసీ/ బీ.ఫార్మసీ విద్యార్హతలు కలిగి ఏపీ ఫార్మసీ కౌన్సిల్ విభాగంలో రిజిస్టర్ అయిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
- ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2: ఈ ఉద్యోగాలకు Diploma in MLT (or) B.Sc MLT విద్యార్హతలు కలిగి APPMB విభాగంలో రిజిస్టర్ అయిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు
- డేటా ఎంట్రీ ఆపరేటర్: ఈ ఉద్యోగాలకు ఏదైనా డిగ్రీ అర్హతతో పాటు PGDCA కంప్యూటర్ కోర్స్ సర్టిఫికెట్ కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. (లేదా) కంప్యూటర్ ఒక సబ్జెక్టుగా కలిగి ఉండి డిగ్రీ పూర్తయిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
- లాస్ట్ గ్రేడ్ సర్వీసెస్: ఈ ఉద్యోగాలకు 10వ తరగతి విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు
Age ఎంత ఉండాలి?
01-12-2025 తేదీ నాటికి 18 నుంచి 42 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవటానికి అవకాశం ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
జీతభత్యాలు
- ఫార్మసిస్ట్ గ్రేడ్ 2: రూ.23,393/-
- ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2: రూ.23,393/-
- డేటా ఎంట్రీ ఆపరేటర్: రూ.18,450/-
- లాస్ట్ గ్రేడ్ సర్వీసెస్: రూ.15,000/-
ఎంపిక విధానం
విద్యార్హతలో వచ్చిన మార్కుల మెరిట్, అనుభవం, రూల్ ఆఫ్ రిజర్వేషన్, సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు ఎటువంటి రాత పరీక్ష ఉండదు.
దరఖాస్తు విధానం
ఈ ఉద్యోగాలకు అర్హత కలిగిన అభ్యర్థులు Offline ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
Application Fee
ఓసి బిసి ఏడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ.300 ఫీజు చెల్లించాలి; ఎస్సీ, ఎస్సీ అభ్యర్థులు రూ.100 ఫీజు చెల్లించాలి.
దరఖాస్తు తేదీలు
ఈ ఉద్యోగాలకు తేదీ నుంచి తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలి
క్రింది లింకు పై క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి
Also Read: 10th అర్హతతో అంగన్వాడీ ఉద్యోగాలు భర్తీ


