ఏపీలో 10th క్లాస్ అర్హతతో అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల | AP Outsourcing Jobs 2025
AP Outsourcing Jobs
AP Outsourcing Jobs: ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్యశాఖలో అవుట్సోర్సింగ్/ కాంట్రాక్టు ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల. మొత్తం 60 పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా మెడికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి నోటిఫికేషన్ విడుదల అయింది. ఆఫీస్ సబార్డినేట్, జనరల్ డ్యూటీ అటెండెంట్, స్టోర్ అటెండెంట్, అనిస్తీషియా టెక్నీషియన్, కార్డియాలజీ టెక్నీషియన్, ల్యాబ్ టెక్నీషియన్, ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్, ల్యాబ్ అటెండెంట్, ఈసీజీ టెక్నీషియన్, లైబ్రరీ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. పోస్టులను అనుసరించి పదవ తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ, డిప్లొమా అర్హతలు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడనికి అవకాశం ఉంటుంది. 18 నుంచి 42 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత కలిగిన అభ్యర్థులు ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. జనవరి 9వ తారీకు లోపు దరఖాస్తు చేసుకోవాలి.
Also Read: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంగన్వాడీ ఉద్యోగాలు
నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ
మెడికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి కాంట్రాక్టు మరియు ఔట్సోర్సింగ్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
పోస్టుల వివరాలు
ఈ నోటిఫికేషన్ ద్వారా ఆఫీస్ సబార్డినేట్, జనరల్ డ్యూటీ అటెండెంట్, స్టోర్ అటెండెంట్, అనిస్తీషియా టెక్నీషియన్, కార్డియాలజీ టెక్నీషియన్, ల్యాబ్ టెక్నీషియన్, ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్, ల్యాబ్ అటెండెంట్, ఈసీజీ టెక్నీషియన్, లైబ్రరీ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 10 రకాల పోస్టులను భర్తీ చేస్తున్నారు.
విద్యార్హతలు
పోస్టులను అనుసరించి 10వ తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ, డిప్లొమా అర్హతలు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడనికి అవకాశం ఉంటుంది.
Age limit
ఈ ఉద్యోగాలకు 18 నుంచి 42 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవటానికి అవకాశం ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది .
ఎంపిక విధానం
విద్యార్హతలో వచ్చిన మార్కుల మెరిట్, అనుభవం, ధృవపత్రాల పరిశీలన, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు ఎటువంటి రాత పరీక్ష ఉండదు.
దరఖాస్తు విధానం
ఈ ఉద్యోగాలకు అర్హత కలిగిన అభ్యర్థులు ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు ఫారం లింక్ క్రింద ఇవ్వడం అయినది.
Application Fee
ఓసి అభ్యర్థులు రూ.300; బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ.200 ఫీజు చెల్లించాలి .
దరఖాస్తు తేదీలు
ఈ ఉద్యోగాలకు 26-12-2025 తేదీ నుంచి 09-01-2026 తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలి.


