AP Government Jobs: ఆంధ్రప్రదేశ్ జిల్లా గ్రంథాలయ సంస్థలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నం జిల్లా గ్రంథాలయ సంస్థలో అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. గ్రేడ్-3 లైబ్రేరియన్, రికార్డ్ అసిస్టెంట్, లైబ్రరీ హెల్పర్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఎనిమిదవ తరగతి, పదవ తరగతి, డిగ్రీ విద్యార్హతలు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎటువంటి రాత పరీక్ష లేదు, ఫీజు లేదు.. మెరిట్ మరియు ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. Offline ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
పోస్టుల వివరాలు:
1.గ్రేడ్-3 లైబ్రేరియన్: 07 పోస్టులు
2.రికార్డ్ అసిస్టెంట్: 01 పోస్టు
3.లైబ్రరీ హెల్పర్: 04 పోస్టులు
మొత్తం పోస్టులు: 12
వయోపరిమితి:
2023 జూలై ఒకటవ తారీఖు నాటికి 18 నుంచి 42 సంవత్సరంలలోపు వయస్సు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
SC/ST/BC అభ్యర్థులకు 5 సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
విద్యార్హతలు:
1.గ్రేడ్-3 లైబ్రేరియన్: ఏదైనా డిగ్రీ అర్హతతో పాటు గుర్తింపు పొందిన ఇన్స్టిట్యూట్ నుండి CLiSc కోర్సులో ఉత్తీర్ణత పొందిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి ఉండాలి.
2.రికార్డ్ అసిస్టెంట్: 10వ తరగతి పాసై కంప్యూటర్ పరిజ్ఞానం కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
3.లైబ్రరీ హెల్పర్: 8వ తరగతి విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎంపిక విధానం:
మెరిట్, ఇంటర్వ్యూ మరియు రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం:
Offline ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
2023 జూలై 15వ తారీకు సాయంత్రం 5 గంటల లోపు దరఖాస్తు చేసుకోవలెను.
అభ్యర్థులు బయోడేటా దరఖాస్తుతో పాటు సర్టిఫికెట్ల జిరాక్స్ ప్రతులను గెజిటెడ్ అధికారి చేత ధ్రువీకరించుకొని, రెండు సొంత చిరునామా గల కవర్లను దరఖాస్తులకు జతచేసి రిజిస్టర్ పోస్ట్ ద్వారా లేదా స్వయంగా కార్యాలయమునకు దరఖాస్తులు సమర్పించవలెను.
దరఖాస్తులు పంపవలసిన చిరునామా:
కార్యదర్శి, జిల్లా గ్రంథాలయ సంస్థ,
లక్ష్మీ గాయత్రి అపార్ట్మెంట్,
డోర్.నెం.48-7-49, ఫ్లాట్ నెం.11,
3వ అంతస్తు, రామాటాకీస్,
వెజ్ మార్కెట్ లైన్,
విశాఖపట్నం- 530016.
క్రింది లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి
ప్రతిరోజు లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి
అతి తక్కువ ధరలో APPSC గ్రూప్-2, గ్రామ సచివాలయం ఆన్లైన్ కోచింగ్ కోసం క్రింది యాప్ లింక్ పై క్లిక్ చేయండి