December 20, 2024
AP Govt Jobs

AP Mega Job Mela: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మెగా జాబ్ మేళా.. టెన్త్, ఇంటర్, డిగ్రీ, డిప్లమా అర్హతలు.. రాత పరీక్ష లేదు, ఫీజు లేదు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల తొమ్మిదవ తేదీన అన్నమయ్య జిల్లా, మదనపల్లెలోని మహిళా డిగ్రీ కళాశాలలో నిరుద్యోగ యువతీ, యువకులకు మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ గిరీష తెలిపారు. ఈ జాబ్ మేళాలో బహుళ జాతీయ కంపెనీలు బిజినెస్ కనెక్ట్, కియా మోటార్స్, హెటిరో డ్రగ్స్, కోజెంట్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్, ముత్తూట్ ఫైనాన్స్, అపోలో ఫార్మసీ, గ్రీన్ టెక్, టిసిఎల్, డిక్సన్, సన్నీ అపోటేక్ ఇండియా లాంటి 15 కంపెనీల ప్రతినిధులు పాల్గొంటారని తెలిపారు.

ఈ జాబ్ మేళాకు అన్నమయ్య జిల్లాలోని టెన్త్, ఇంటర్, ఐటిఐ, డిప్లమా, డిగ్రీ, బి.టెక్, ఫార్మసీ, ఎం. ఫార్మసీ, బీఎస్సీ, ఎంబీఏ పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులని తెలిపారు. ఈ జాబ్ మేళాలో 1000 పైగా ఉద్యోగాల కోసం ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారు. 18 నుంచి 30 సంవత్సరాలలోపు ఉన్న అభ్యర్థులు అర్హులు. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.10 వేలు మొదలు రూ.30 వేల వరకు జీతం ఉంటుందని తెలియజేశారు. జూన్ 9వ తేదీ శుక్రవారం నేరుగా అభ్యర్థులు వారి బయోడేటా, సర్టిఫికెట్స్ తో ఇంటర్వ్యూకు మదనపల్లెలోని మహిళా డిగ్రీ కళాశాలలో హాజరుకావాలని కలెక్టర్ తెలిపారు.

Join Our Telegram Group

కంపెనీల వారీగా ఖాళీల వివరాలు

అపోలో ఫార్మసీలో ఉద్యోగాలు

ఈ సంస్థలో 100 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. ఫార్మసిస్ట్, రిటైల్ ట్రైనీ అసోసియేట్ విభాగాల్లో ఖాళీలను భర్తీ చేస్తున్నారు. 19 నుంచి 30 సంవత్సరాల లోపు వయసు ఉండాలి. ఎంపికైన వారికి నెలకు రూ.15 వేల వరకు వేతనం ఉంటుంది. ఇంటర్మీడియట్, ఏదైనా డిగ్రీ, బి. ఫార్మసీ, ఎం. ఫార్మసీ, డి. ఫార్మసీ చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

కియా మోటార్స్ కంపెనీలో ఉద్యోగాలు

ఈ సంస్థలో 100 పోస్టులను భర్తీ చేస్తున్నారు. నీమ్ ట్రైనీ విభాగంలో ఖాళీలు ఉన్నాయి. డిప్లొమా అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. 18 నుంచి 25 సంవత్సరాల లోపు వయసు ఉన్న పురుష అభ్యర్థులు మాత్రమే అర్హులు. ఈ పోస్టులకు ఎంపికైన వారికి నెలకు 16 వేల రూపాయల వరకు వేతనం ఉంటుంది.

ముత్తూట్ ఫైనాన్స్ కంపెనీలో ఉద్యోగాలు

ఈ సంస్థలో 50 ఖాళీలు ఉన్నాయి. జూనియర్ రిలేషన్షిప్ ఎగ్జిక్యూటివ్ విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి. ఏదైనా డిగ్రీ విద్యార్హత కలిగిన పురుష అభ్యర్థులు అర్హులు. 28 సంవత్సరాల లోపు వయసు ఉండాలి. ఎంపికైన అభ్యర్థులకు 20,800 వరకు వేతనం ఉంటుంది.

హెటిరో డ్రగ్స్ కంపెనీలో ఉద్యోగాలు

ఈ సంస్థలో 90 ఖాళీలు ఉన్నాయి. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్, మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్, QA, QC, R&D డిపార్ట్మెంట్లలో ఖాళీలు ఉన్నాయి. బీఎస్సీ, ఎంఎస్సీ, బీకాం, ఐటిఐ, డిప్లొమా అర్హత కలిగిన అభ్యర్థులు అర్హులు. 27 సంవత్సరాల లోపు ఉన్న పురుష అభ్యర్థుల అర్హులు.

డిక్సాన్ టెక్నాలజీస్ కంపెనీలో ఉద్యోగాలు

ఈ సంస్థలో 50 ఖాళీలు ఉన్నాయి. పదవ తరగతి పాస్ అయిన స్త్రీ, పురుష అభ్యర్థులు అర్హులు. 18 నుంచి 30 సంవత్సరాల లోపు వయసు ఉండాలి. టీవీ అసెంబ్లింగ్ ఆపరేటర్ విభాగంలో ఖాళీలు ఉన్నాయి.

కనెక్ట్ బిజినెస్ సొల్యూషన్స్ కంపెనీలో ఉద్యోగాలు

ఈ సంస్థలో 30 ఖాళీలు ఉన్నాయి. బిఈ/ బిటెక్/ ఎంసీఏ అర్హతలు కలిగిన స్త్రీ, పురుష అభ్యర్థులు అర్హులు. 18 నుంచి 26 సంవత్సరాల లోపు వయసు ఉండాలి. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.20 వేల వేతనం ఉంటుంది.

యంగ్ ఇండియా కంపెనీలో ఉద్యోగాలు

ఈ సంస్థలో 100 ఖాళీలు ఉన్నాయి. ఇంటర్మీడియట్ పాసైన స్త్రీ, పురుష అభ్యర్థులు అర్హులు. 18 నుంచి 30 సంవత్సరాల లోపు వయసు ఉండాలి. మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ విభాగంలో ఖాళీలు ఉన్నాయి.

మరిన్ని కంపెనీల్లో ఉద్యోగ ఖాళీల వివరాల కొరకు APSSDC విడుదల చేసిన క్రింది పట్టిక చూడగలరు

దరఖాస్తు విధానం వివరాలు

ప్రతిరోజు లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ గ్రూపులో జాయిన్ అవ్వండి

Telegram Group Link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!