AP JLM Syllabus: ఏపీ జూనియర్ లైన్ మెన్ (జేఎల్ఎం) సిలబస్.. ఇక్కడ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి
AP JLM Syllabus: ఆంధ్రప్రదేశ్ డిస్కామ్స్ (AP DISCOMS) లో జూనియర్ లైన్మెన్ ఉద్యోగాలు భర్తీకి త్వరలో నోటిఫికేషన్లు విడుదల చేయనున్నారు. APCPDCL, APSPDCL, APEPDCL లో జూనియర్ లైన్ మెన్ (JLM) ఉద్యోగాలు భర్తీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నోటిఫికేషన్లు విడుదల చేసే దిశగా అధికారులు సిద్ధం చేస్తున్నారు.
APCPDCL పరిధిలో 860 జూనియర్ లైన్మెన్ ఉద్యోగాలు భర్తీకి త్వరలో నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు గౌరవ సీఎండీ పుల్లారెడ్డి గారు తెలిపారు. ఈయన 2025 నవంబర్ 28వ తారీఖున ఏలూరు జిల్లా నూజివీడులోని ఇండోర్ సబ్ స్టేషన్లో విద్యుత్ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ APCPDCL పరిధిలోని ఉమ్మడి కృష్ణ, గుంటూరు, ప్రకాశం జిల్లాలో ఖాళీగా ఉన్న 860 జూనియర్ లైన్మెన్ పోస్టులు, 56 AE పోస్టులు, 70 JE పోస్టులు భర్తీ చేయడానికి నోటిఫికేషన్లు విడుదల చేయనున్నామని తెలిపారు. త్వరలోనే ఈ నోటిఫికేషన్లు విడుదల చేయనున్నట్లు తెలిపారు.

