AP ఇంటర్ ఫలితాలు విడుదల | AP Inter 1st year results 2024, AP Inter 2nd year results 2024
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ 1st & 2nd ఇయర్ పరీక్షల ఫలితాలను ఏప్రిల్ 15లోపు విడుదల చేసేందుకు ఇంటర్మీడియట్ విద్యామండలి కసరత్తు చేస్తోంది. జవాబు పత్రాల మూల్యాంకనం, మార్కుల స్కానింగ్కు సంబంధించిన ప్రక్రియ ఏప్రిల్ 7న ముగిసింది. మూల్యాంకనాన్ని మరోసారి పునఃపరిశీలన చేసేందుకు వారం రోజులు సమయం పట్టనుంది.
ఇంటర్మీడియట్ పరీక్షలు మార్చి 1 నుంచి 20వ తేదీ వరకు నిర్వహించిన విషయం తెలిసిందే. ప్రథమ, ద్వితీయ సంవత్సరాల పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా 10 లక్షలకుపైగా విద్యార్థులు హాజరయ్యారు. ఫలితాలు విడుదల చేసిన తరువాత.. విద్యార్థులందరూ తమ ఫలితాలను http://resultsbie.ap.gov.in/ వెబ్సైట్ ద్వారా చూసుకోగలరు.