AP Health Department Jobs 2026 | 10th & డిగ్రీ అర్హత | పరీక్ష లేదు | Apply Offline

WhatsApp Group Join Now
Telegram Group Join Now

AP Health Department Jobs 2026: ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖలో కాంట్రాక్ట్ మరియు అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల. విశాఖపట్నం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కార్యాలయం నుంచి ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఫార్మసిస్ట్, ల్యాబ్ టెక్నీషియన్, డేటా ఎంట్రీ ఆపరేటర్, లాస్ట్ గ్రేడ్ సర్వీస్, సీనియర్ ట్రీట్మెంట్ సూపర్వైజర్ పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు.

ఈ ఉద్యోగాలకు 10వ తరగతి, డిగ్రీ, బీఎస్సీ MLT, బీ ఫార్మసీ అర్హతలు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు 18 నుంచి 42 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఎటువంటి రాతపరీక్ష ఉండదు విద్యార్హతలు వచ్చిన మార్కుల మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అర్హత, వయస్సు, జీతం, దరఖాస్తు, ఎంపిక విధానం వివరాలు తెలుసుకుందాం..

AP Health Department Jobs 2026

🏛️ నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ

జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కార్యాలయం (DMHO), విశాఖపట్నం నుంచి నోటిఫికేషన్ విడుదలైంది.

AP Anganwadi Jobs: ఏపీలో 10th అర్హతతో అంగన్వాడీ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

🎯 పోస్టుల వివరాలు

ఈ నోటిఫికేషన్ ద్వారా ఫార్మసిస్ట్, ల్యాబ్ టెక్నీషియన్, డేటా ఎంట్రీ ఆపరేటర్, లాస్ట్ గ్రేడ్ సర్వీస్, సీనియర్ ట్రీట్మెంట్ సూపర్వైజర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు.

  • ఫార్మసిస్ట్: 04 పోస్టులు
  • ల్యాబ్ టెక్నీషియన్: 04 పోస్టులు
  • డేటా ఎంట్రీ ఆపరేటర్: 05 పోస్టులు
  • లాస్ట్ గ్రేడ్ సర్వీస్: 05 పోస్టులు
  • సీనియర్ ట్రీట్మెంట్ సూపర్వైజర్: 02 పోస్టులు
  • మొత్తం 20 పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు

🎓 విద్యార్హతలు

  • ఫార్మసిస్ట్ గ్రేడ్ 2: ఈ పోస్టులకు పదవ తరగతి పాసై, బి.ఫార్మసీ/ డి.ఫార్మసీ లేదా ఇంటర్మీడియట్ ఒకేషనల్ ఫార్మసీ చేసి, ఏపీ ఫార్మసీ కౌన్సిల్ లో రిజిస్ట్రేషన్ చేసుకుని ఉండాలి
  • ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2: DMLT లేదా B.Sc (MLT) కోర్సు పూర్తి అయి ఆంధ్రప్రదేశ్ పారామెడికల్ బోర్డులో రిజిస్ట్రేషన్ అయి ఉండాలి
  • డేటా ఎంట్రీ ఆపరేటర్: ఏదైనా డిగ్రీ అర్హతతో పాటు PGDCA కంప్యూటర్ కోర్స్ సర్టిఫికెట్ కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు
  • లాస్ట్ గ్రేడ్ సర్వీస్: 10వ తరగతి పాసైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు
  • సీనియర్ ట్రీట్మెంట్ సూపర్వైజర్: బ్యాచిలర్ డిగ్రీ లేదా సానిటరీ ఇన్స్పెక్టర్ కోర్స్ చేసి ఉండి, కంప్యూటర్ సర్టిఫికెట్ కలిగి, టు వీలర్ డ్రైవింగ్ లైసెన్స్ తో పాటు, టీవీ హెల్త్ విజిటర్/ సోషల్ వర్క్ అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

👩‍🎓 వయోపరిమితి

18 నుంచి 42 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రభుత్వాన్నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

💰 జీతభత్యాలు

✍️ ఎంపిక విధానం

విద్యార్హతలో వచ్చిన మార్కుల మెరిట్ మరియు రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఎటువంటి రాతపరీక్ష ఉండదు, ఇంటర్వ్యూ ఉండదు.

AP High Court Notification 2026 – 10th క్లాస్, డిగ్రీ అర్హతలతో ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

🌐 దరఖాస్తు విధానం

ఈ ఉద్యోగాలకు అర్హత కలిగిన అభ్యర్థులు ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు ఫారం కొరకు క్రింది నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి. నోటిఫికేషన్ తో పాటు ఉన్న దరఖాస్తు ఫారాన్ని ప్రింట్ తీసుకొని, వివరాలను పూర్తిగా నింపి, దరఖాస్తుకు మీయొక్క ధ్రువపత్రాలను జతపరిచి అప్లై చేసుకోవాలి.

👉 దరఖాస్తు ఫీజు

  • OC/ BC అభ్యర్థులు: ₹200/-
  • SC/ ST/ PH అభ్యర్థులు: ₹100/-

📆 దరఖాస్తు తేదీలు

ఈ ఉద్యోగాలకు అర్హత కలిగిన అభ్యర్థులు ఫిబ్రవరి 26వ తారీకు సాయంత్రం ఐదు గంటల లోపు దరఖాస్తు చేసుకోవాలి.

📃 అవసరమైన ధ్రువపత్రాలు

  • 10వ తరగతి సర్టిఫికెట్ (DOB)
  • విద్యార్హతల సర్టిఫికెట్లు
  • కుల ధ్రువీకరణ పత్రం (ఉంటే)
  • స్టడీ సర్టిఫికెట్లు
  • దివ్యాంగుల సర్టిఫికెట్ (ఉంటే)
  • సర్వీస్ సర్టిఫికెట్ (ఉంటే)
  • దరఖాస్తు ఫీజు రసీదు
  • పూర్తిచేసిన అప్లికేషన్ ఫారం

⚠️ ముఖ్య గమనిక

అభ్యర్థులు అధికారిక వెబ్సైట్లో విడుదల విడుదల చేసిన నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని మరొకసారి పూర్తి వివరాలు చదివి దరఖాస్తు చేసుకోండి.

AP Home Guard Recruitment 2026
AP Home Guard Recruitment 2026 – హోంగార్డు ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ | జీతం రోజుకు రూ.710/- | Apply Offline

📌 క్రింది లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి

Notification Link

Official Website

WhatsApp Group Join Now
Telegram Group Join Now
error: Content is protected !!