AP Grama Sachivalayam Jobs: గ్రామ సచివాలయం ఉద్యోగ ఖాళీల వివరాలు..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జిల్లాల వారీగా గ్రామ, వార్డు సచివాలయాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను అధికారులు సేకరిస్తున్నారు. ప్రస్తుతం గ్రామ సచివాలయాల్లో ఏ శాఖలో ఎన్ని ఖాళీలు ఉన్నాయి, వార్డు సచివాలయాల్లో ఏ శాఖలో ఎన్ని ఖాళీలు ఉన్నాయి అనే వివరాలను సేకరిస్తున్నారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో ఖాళీగా ఉన్న, ఇంకా మిగిలిపోయిన ఉద్యోగాల భర్తీకి ఇప్పుడు మరో విడత.. మూడో నోటిఫికేషన్ జారీకి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఈ విడతలో మాత్రం ఆన్లైన్ విధానంలో పరీక్షల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. గతంలోలా కాకుండా ఈసారి 19 కేటగిరి ఉద్యోగాలకు వేర్వేరుగా 19 రకాల పరీక్షల నిర్వహణకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.
Grama Sachivalayam Online Coaching
ప్రస్తుతం జిల్లాల వారీగా ఖాళీగా ఉన్న పోస్టులను సేకరించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయాల్లోని ఉద్యోగుల బదిలీలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. సచివాలయ ఉద్యోగుల యొక్క బదిలీల ప్రక్రియ పూర్తయిన తర్వాత, మరొక్కసారి రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల వారిగా ఖాళీల వివరాలను పునః పరిశీలించి.. మూడవ నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉంది.
అనంతపురం జిల్లాలో గ్రామ, వార్డు సచివాలయాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను అధికారులు సేకరించారు. వివిధ కేటగిరీల్లో 1360 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు గుర్తించారు. వీటిలో గ్రామ సచివాలయాల్లో 1151 పోస్టులు, వార్డు సచివాలయాల్లో 209 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
అనంతపురం జిల్లా ఖాళీల వివరాలు
గ్రేడ్-5 పంచాయతీ కార్యదర్శులు: 78
డిజిటల్ అసిస్టెంట్: 52
వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్: 46
విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్: 18
హార్టికల్చర్ అసిస్టెంట్: 126
సెరికల్చర్ అసిస్టెంట్: 3
వెటర్నరీ అసిస్టెంట్: 543
ఫిషరీస్ అసిస్టెంట్: 5
ఇంజనీరింగ్ అసిస్టెంట్: 83
వీఆర్వో గ్రేడ్-2 లేదా వార్డు రెవెన్యూ సెక్రటరీ: 19
విలేజ్ సర్వేయర్ అసిస్టెంట్: 41
వార్డు అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ: 29
వార్డు ఎడ్యుకేషన్ అండ్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ: 23
వార్డు వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సెక్రటరీ: 13
వార్డు శానిటేషన్ అండ్ ఎన్విరాన్మెంట్ సెక్రటరీ: 41
వార్డు ప్లానింగ్ అండ్ రెగ్యులేషన్ సెక్రటరీ: 56
వార్డు ఎమినిటీస్ సెక్రటరీ: 47
ఏఎన్ఎం లేదా వార్డు హెల్త్ సెక్రటరీ: Nil
మహిళా పోలీసు (గ్రామ/వార్డు): 137
ఎనర్జీ అసిస్టెంట్: ——-?
మొత్తం ఖాళీలు: 1360
కేటగిరి-1 పోస్టులు అయినటువంటి పంచాయతీ సెక్రెటరీ గ్రేడ్-5, వెల్ఫేర్ & ఎడ్యుకేషన్ అసిస్టెంట్, వార్డ్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ, మహిళా పోలీస్ ఉద్యోగాల సిలబస్ వివరాలు కింద ఇవ్వడమైనది. కేటగిరి-1 పోస్టులు అన్నింటికీ ఒకే సిలబస్ ఉంటుంది. పరీక్షలు మాత్రం ఈసారి వేరువేరుగా నిర్వహిస్తారు. ఆన్లైన్ విధానంలో నిర్వహించే అవకాశం ఉంది. ఏదైనా డిగ్రీ విద్యార్హత కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. కేటగిరి-1 ఉద్యోగాల రాతపరీక్షలో ఒకే పేపర్ ఉంటుంది. ఈ పేపర్లో పార్ట్-A, పార్ట్-B అను రెండు పార్టులు ఉంటాయి. ఒక్కో పార్ట్ నుండి 75 ప్రశ్నలు ఉంటాయి. మొత్తం 150 ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు ఒక మార్కు చొప్పున 150 మార్కులకు పరీక్షను నిర్వహిస్తారు. ఈ పరీక్షలో వచ్చిన మార్కులను ఆధారంగా చేసుకుని అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
కేటగిరి-1 పోస్టుల సిలబస్
PART – A
జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ
1.జనరల్ మెంటల్ ఎబిలిటీ మరియు రీజనింగ్.
2.డేటా ఇంటర్ ప్రేటేషన్ తో సహా క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్.
3.రీడింగ్ కాంప్రహెన్షన్ – తెలుగు & ఇంగ్లీష్.
4.జనరల్ ఇంగ్లీష్.
5.ప్రాథమిక కంప్యూటర్ పరిజ్ఞానం.
6.ప్రాంతీయ , జాతీయ మరియు అంతర్జాతీయ ప్రాముఖ్యత కలిగిన కరెంట్ అఫైర్స్.
7.జనరల్ సైన్స్ మరియు నిత్యజీవితంలో జనరల్ సైన్స్ అనువర్తనాలు, సైన్స్ అండ్ టెక్నాలజీ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో అభివృద్ధి.
8.సుస్థిరాభివృద్ధి మరియు పర్యావరణ పరిరక్షణ.
PART – B
1.ఆంధ్రప్రదేశ్ పై ప్రత్యేక దృష్టితో భారతదేశ చరిత్ర మరియు సంస్కృతి.
2.భారత రాజ్యాంగం మరియు గవర్నెన్స్. 73, 74 రాజ్యాంగ సవరణలు. కేంద్ర – రాష్ట్ర సంబంధాలు.
3.ఆంధ్రప్రదేశ్ పై ప్రత్యేక దృష్టితో భారతదేశ ఆర్థిక వ్యవస్థ మరియు ప్రణాళిక.
4.సమాజం, సామాజిక న్యాయం మరియు హక్కుల సమస్యలు.
5.భారత ఉపఖండం మరియు ఆంధ్రప్రదేశ్ యొక్క భౌతిక భౌగోళిక శాస్త్రం.
6.ఆంధ్రప్రదేశ్ విభజన మరియు దాని పరిపాలన, ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక, రాజకీయ మరియు న్యాయంపరమైన చిక్కులు/ సమస్యలు.
7.ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క ముఖ్యమైన సంక్షేమ మరియు అభివృద్ధి పథకాలు.
8.మహిళా సాధికారత, స్వయం సహాయక బృందాలు.
ప్రతిరోజు లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ గ్రూపులో జాయిన్ అవ్వండి
అతి తక్కువ ధరలో గ్రామ సచివాలయం ఆన్లైన్ కోచింగ్ కోసం క్రింది యాప్ లింక్ పై క్లిక్ చేయండి