September 10, 2024
Police/DefenceTS Govt Jobs

TSLPRB: ఈనెల 14 నుంచి తెలంగాణ ఎస్సై, కానిస్టేబుల్ ధ్రువీకరణ పత్రాల పరిశీలన

తెలంగాణ రాష్ట్రంలో ఎస్సై, కానిస్టేబుళ్ల ఎంపిక ప్రక్రియను తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక మండలి (TSLPRB) వేగవంతం చేసింది. తుది రాత పరీక్షల ఫలితాలను ఇటీవల వెల్లడించిన మండలి. ఆ తర్వాతి దశపై దృష్టి సారించింది. రాత పరీక్షల్లో అర్హత సాధించిన అభ్యర్థుల ధ్రువీకరణ పత్రాలను ఈ నెల 14 నుంచి 26వ తేదీ వరకు పరిశీలించాలని నిర్ణ యించింది. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా 18 ప్రాంతాల్లో కేంద్రాలను ఏర్పాటు చేసింది. ప్రతి కేంద్రానికి అదనపు ఎస్పీ స్థాయి అధికారిని పర్యవేక్షకుడిగా నియమించనుంది.

తుదిఎంపికలో కటాఫ్ మార్కులే కీలకం

ధ్రువీకరణ పత్రాల పరిశీలన అనంతరం తుది ఎంపిక ప్రక్రియ మొదలవుతుంది. తుది ఎంపికకు కీలకమైన కటాఫ్ మార్కులను నిర్ణయించనున్నారు. ఇందుకోసం జిల్లా, కంటీజియస్ డిస్ట్రిక్ట్ (పొరుగునే ఉండే జిల్లా), జోనల్, మల్టీజోనల్ స్థాయుల్లోని ఖాళీలను పరిగణన లోకి తీసుకోనున్నారు. తుది రాత పరీక్ష ఫలితాల అనంతరం 1,50,852 మందిని అర్హులుగా గుర్తించారు. వీరిలో ఒకటికంటే ఎక్కువ పరీక్షల్లో అర్హత సాధించినవారు ఉండటంతో వాస్తవ అర్హుల సంఖ్య సుమారు 1.09 లక్షల మంది ఉన్నట్లు తేలింది. ఈ లెక్కన మొత్తం 17,516 పోస్టుల కోసం సగటున ఆరుగురు చొప్పున పోటీపడుతున్నట్లు వెల్లడైంది.

ధ్రువీకరణ పత్రాల పరిశీలన కేంద్రాలు:

హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ, వరంగల్, కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్, సిద్దిపేట, రామగుండం, ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, నల్గొండ, సూర్యాపేట, సంగారెడ్డి, జోగులాంబ గద్వాల, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్

సమర్పించాల్సిన ధ్రువీకరణపత్రాలు

★సామాజిక ధ్రువీకరణ పత్రం (2014 జూన్ 2 లేదా ఆ తర్వాతి తేదీతో ఉండాలి)

★బీసీ అభ్యర్థులకు నాన్ క్రీమీలేయర్ ధ్రువీకరణ పత్రం (2021 ఏప్రిల్ 1 లేదా ఆ తర్వాతి తేదీతో…)

★ఆర్థికంగా వెనకబడిన తరగతుల ధ్రువీకరణ పత్రం (2021 ఏప్రిల్ 1 లేదా ఆ తర్వాతి తేదీతో…)

★ విద్యార్హతలకు సంబంధించిన ధ్రువపత్రాలు

క్రింది PDF లింక్ పై క్లిక్ చేసి పూర్తి వివరాలను తెలుసుకోగలరు

Download PDF

ప్రతిరోజు లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ గ్రూపులో జాయిన్ అవ్వండి

Telegram Group Link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!