AP గ్రామ సచివాలయం జిల్లాల వారీగా ఉద్యోగ ఖాళీల వివరాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉద్యోగాల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్లను త్వరలోనే విడుదల చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశానుసారం 14 వేలకు పైగా ఉద్యోగాల భర్తీకి ఫిబ్రవరిలోనే నోటిఫికేషన్లను విడుదల చేసే అవకాశం ఉంది. జిల్లాల వారీగా ఖాళీలను గుర్తించే పనిలో అధికారులు నిమగ్నమై ఉన్నారు. ప్రస్తుతం గ్రామ సచివాలయాల్లో అగ్రికల్చర్ అసిస్టెంట్ ఉద్యోగ ఖాళీలను అధికారులు గుర్తించడం జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 467 పోస్టులను గుర్తించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 13 జిల్లాల్లో కూడా ఖాళీలు ఉన్నాయి.
అగ్రికల్చర్ అసిస్టెంట్ జిల్లాల వారీగా ఖాళీల వివరాలు
శ్రీకాకుళం: 60
విజయనగరం: 36
విశాఖపట్నం: 28
తూర్పుగోదావరి: 77
పశ్చిమగోదావరి: 40
కృష్ణ: 25
గుంటూరు: 37
ప్రకాశం: 53
నెల్లూరు: 37
కర్నూల్: 11
కడప: 15
అనంతపురం: 15
చిత్తూరు: 33
మొత్తం ఖాళీలు: 467
మొత్తం 19 రకాల పోస్టుల భర్తీకి 19 నోటిఫికేషన్లను విడుదల చేయడానికి అధికారులు సన్నద్ధమవుతున్నారు. ఈసారి రాత పరీక్షలను ఆన్లైన్లో నిర్వహించనున్నారు. 19 రకాల పోస్టులకు కూడా వేర్వేరు పరీక్షలను నిర్వహించినారు.