AP Government Jobs: ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖలో 3,282 ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్
APPSC | ఆంధ్రప్రదేశ్ యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్న 3,282 అధ్యాపక పోస్టుల భర్తీకి ఈ నెల 20న నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ కె.హేమచంద్రారెడ్డి తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్న 3,282 అధ్యాపక పోస్టుల భర్తీకి ఈ నెల 20న నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ కె.హేమచంద్రారెడ్డి తెలిపారు. డైరెక్టర్ రిక్రూట్మెంట్ విధానంలో ఈ పోస్టులను భర్తీ చేయనున్నట్లు తెలిపారు. యూనివర్సిటీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ తదితర ప్రతి పోస్టునూ భర్తీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు. వర్సిటీల్లో ఇంత భారీ ఎత్తున ఖాళీల భర్తీ గతంలో ఎప్పుడూ జరగలేదని గుర్తు చేశారు. యూనివర్సిటీలను పటిష్టం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుంటోందని వెల్లడించారు.
తూర్పుగోదావరి జిల్లా రాజానగరం సమీపంలోని ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయంలో సోమవారం విలేకరులతో ఉన్నత విద్యా మండలి చైర్మన్ హేమచంద్రారెడ్డి మాట్లాడారు. అధ్యాపకుల పోస్టుల భర్తీలో భాగంగా ప్రస్తుతం పని చేస్తున్న అడహాక్ అధ్యాపకులకు 10% మార్కులను వెయిటేజి ఇవ్వనున్నట్లు తెలిపారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు రాత పరీక్ష నిర్వహించి, ఒక్కో పోస్టుకు 12 మందిని ఎంపిక చేస్తామని ఆయన తెలిపారు. వారి నుంచి అకడమిక్ ప్రతిభ ఆధారంగా ఒక పోస్టుకు నలుగురిని ఎంపిక చేయనున్నట్లు హేమచంద్రారెడ్డి తెలిపారు.
ప్రతిరోజు లేటెస్ట్ జాబ్ అప్డేట్స్, కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ గ్రూపులో జాయిన్ అవ్వండి