AP దేవాదాయ శాఖలో 700 ఉద్యోగాలు భర్తీకి కసరత్తు | AP Endowment Department Jobs Recruitment 2024
AP Endowment Department Jobs: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దేవదాయ శాఖలో ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. 700 ఖాళీ పోస్టులను గుర్తించారు. ఎన్నికలలోపే ఖాళీ పోస్టులను భర్తీ చేయడానికి కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. రాష్ట్రవ్యాప్తంగా ప్రధాన ఆలయాలతో పాటు ఇతర ఆలయాల్లోనూ చాలాకాలంగా కిందిస్థాయి ఉద్యోగుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
ఇప్పటికే ప్రధాన ఆలయాల ఈవోలు, ఇతర ఆలయాల సహాయ కమిషనర్లు, జిల్లా దేవాదాయ శాఖ అధికారులు, ఉప కమిషనర్లు, ప్రాంతీయ సంయుక్త కమిషనర్లతో వరుసగా సమావేశాలు నిర్వహిస్తూ ఖాళీల సమాచారం ఇవ్వాలని ప్రభుత్వం ఒత్తిడి తెస్తోంది. ఇప్పటివరకు 700 వరకు ఖాళీలు గుర్తించినట్లు సమాచారం. ఈ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడానికి కసరత్తు చేస్తున్నారు. ఒక్కో ఆలయ పరిధిలో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేస్తారా లేక అన్ని ఆలయాలకు కలిపి సెంట్రలైజ్డ్ విధానంలో ఎంపిక ప్రక్రియ జరుపుతారా అన్నదానిపై స్పష్టత రావడం లేదు. దీనిపై స్పష్టత వచ్చాక నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉంది.
✅నిరుద్యోగులకు సంక్రాంతి ఆఫర్: AP గ్రూప్-2 Full Course + Test Series కేవలం “399 రూపాయలకే” అందించడం జరుగుతోంది. 1022 వీడియోలు, 111 టెస్టులు, 106 PDFలు ఉంటాయి. Full Course + Test Series కోసం క్రింది యాప్ లింక్ పై క్లిక్ చేయండి.
✅ప్రతిరోజు లేటెస్ట్ జాబ్ అప్డేట్స్, కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ కోసం వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూపులో జాయిన్ అవ్వండి