AP జిల్లా కోర్టు ఉద్యోగాల ప్రశ్నపత్రం, ఆన్సర్ ‘కీ’, రెస్పాన్స్ షీట్ విడుదల | Download Link
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జిల్లా కోర్టు ఉద్యోగాలకు సంబంధించిన అన్ని రకాల పోస్టుల యొక్క ప్రశ్న పత్రం, ప్రిలిమినరీ కీ, రెస్పాన్స్ షీట్ లను హైకోర్టు అధికారిక వెబ్సైట్లో విడుదల చేశారు. జిల్లా కోర్టు ఉద్యోగాల కంప్యూటర్ ఆధారిత పరీక్షలను 2022 డిసెంబర్ 21 నుండి 2023 జనవరి 2 వరకు జరిగాయి. కంప్యూటర్ ఆధారిత పరీక్షలు నిర్వహించిన స్టెనోగ్రాఫర్ గ్రేడ్ – III, జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్, ఫీల్డ్ అసిస్టెంట్, ఎగ్జామినర్, కాపీయిస్ట్, డ్రైవర్, రికార్డ్ అసిస్టెంట్, ప్రాసెస్ సర్వర్ మరియు ఆఫీస్ సబార్డినేట్ పోస్టుల యొక్క ప్రశ్నపత్రం, ప్రిలిమినరీ కీ మరియు రెస్పాన్స్ షీట్‌లు హైకోర్టు అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపరిచారు.
అభ్యర్థులు ప్రశ్నలు మరియు ప్రిలిమినరీ కీపై అభ్యంతరాలు ఉంటే 04.01.2023 నుండి 07.01.2023 వరకు ఆన్‌లైన్‌లో సాయంత్రం 5.00 గంటల వరకు అబ్జెక్షన్స్ తెలపచ్చు.
క్రింది లింక్ పై క్లిక్ చేసి ఆన్సర్ కీ డౌన్లోడ్ చేసుకోండి.
Download Answer Key
Official Website