AP Constable Hall Tickets 2023: ఆంధ్రప్రదేశ్ పోలీస్ కానిస్టేబుల్ ప్రిలిమ్స్ హాల్ టిక్కెట్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలంటే?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీస్ కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్షను 2023 జనవరి 22వ తారీఖున నిర్వహిస్తారు. ఈ పోస్టు లకు భారీ స్థాయిలో దరఖాస్తులు వచ్చాయి. 5,09,579 మంది దరఖాస్తు చేశారు. సగటున ఒక్కో పోస్టుకు 83 మంది పోటీ పడుతున్నారు. సివిల్ కానిస్టేబుల్ , ఏపీఎస్పీ కానిస్టేబుల్ కలిపి మొత్తం 6,100 పోస్టుల భర్తీకి పోలీసు నియామక మండలి ఇటీవల నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ పోస్టులకు దరఖాస్తు గడువు శనివారంతో ముగిసింది. ఆన్లైన్ దరఖాస్తుల్లో అభ్యర్థులు తప్పులు చేసి ఉంటే ఎడిట్ చేసేందుకు ఆదివారం ఉదయం 10 గంటల నుంచి సోమవారం సాయంత్రం 5 గంటల వరకు పోలీసు నియా మక మండలి అవకాశం కల్పించింది. ఈ పోస్టుల భర్తీకి ప్రిలిమినరీ పరీక్ష ఈ నెల 22 న జరగనుంది. అభ్యర్థులు హాల్ టికెట్లను ఈ నెల 12వ తారీకున ఉదయం 10 గంటల నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని పోలీసు నియామక మండలి తెలిపింది. www.slprb.ap.gov.in వెబ్సైట్ ద్వారా హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవాలి.
క్రింది లింక్ పై క్లిక్ చేసి హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు.